నిజానికి అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు జనంలో కనిపించరు. ఎక్కడో కాశీ, హరిద్వార్, హిమాలయాలు, కొండలు, గుహలే వీరి ఆవాసాలు. కుంభమేళా వంటివి వచ్చినప్పుడే పుణ్య స్నానాల కోసం అది కూడా గుంపులు గుంపులుగా వస్తుంటారు. స్నానాలు చేసి తిరిగి వెళ్తుంటారు. వారు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. అలా తమ గోప్యత పాటిస్తారు. సింగిల్‌గా ఎక్కడా తిరగరు. కనిపించరు కూడా.. కానీ తెలుగునాట తిరుగుతున్న లేడీ అఘోరి కథే వేరుగా కనిపిస్తోంది. పొంతనలేని మాటలు, సంబంధం లేని చర్యలు.. వీటి గురించే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు.
Also Read: అఘోరీ మాత కారు మొరాయింపు.. పాదయాత్రగా పయనం.. ఎక్కడికో తెలుసా?
ఇక ఇటీవల లేడీ అఘోరి నాగసాధువు మాటలు వింటే.. తనకు ఇంకా 30 ఏళ్ల పాటు మరణం లేదని, ఆ తర్వాత తానే ప్రాణార్పణ చేసుకుంటానని చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమైంది. అక్కడికి వెళ్లిన లేడీ అఘోరిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. వస్త్రధారణపై ప్రశ్నించారు. దుస్తులుంటేనే లోపలికి అనుమతిస్తామన్నారు. తన శివయ్యను అలాగే దర్శించుకుంటానని అఘోరీ వాదించింది. కోపగించుకుంది. శపించేందుకు సిద్ధమైపోయింది. వెంటనే కారులో పెట్రోల్ క్యాన్ ను బయటకు తీసి ఇదిగో ఇలా ఒంటిపై పోసుకుంది. అక్కడే ఆత్మార్పణ చేసుకుంటాననన్నది. వెంటనే మహిళా పోలీసులు, ఇతర మహిళలు వచ్చి నచ్చజెప్పి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.
30 ఏళ్ల పాటు ఇంకా జీవితకాలం ఉందని చెబుతున్న ఈ అఘోరీ.. శ్రీకాళహస్తిలో చేసిందేమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి సనాతన ధర్మం కోసమైనా, మహిళల రక్షణ కోసమైనా.. చాలా రకాల పనులు జరుగుతున్నాయి. అయితే అఘోరీ మాత్రం తన టైం వచ్చిందని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమవడం, ఎక్కడికెళ్లినా అలజడి, హైటెన్షన్ పెరగడం కామన్‌గా మారాయి. ముఖ్యంగా పోలీసులకు ఈ మ్యాటర్ ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు. అగ్రెసివ్‌గా వెళ్తే ఒక సమస్య, అలాగే వదిలేద్దామనుకుంటే ఇంకో సమస్య.
అఘోరాలు, అఘోరీలు, నాగసాధువుల లెక్క వేరుగా ఉంటుంది. వారి పర్యటనలు రహస్యంగా సాగుతుంటాయి. కానీ ఇక్కడ లేడీ అఘోరి రూటే సపరేటుగా ఉండడంతో వెళ్లిన ప్రతి చోటా అలజడి రేగుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణలో కొండగట్టు అంజన్న, కొమురవెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న దర్శనాలతో వాతావరణం వేడెక్కింది. మరోవైపు ఏపీలో పవన్ కళ్యాణ్ ని కలవాలంటూ హల్ చల్ చేసింది. అఘోరి మాత స్వస్థలం మంచిర్యాల జిల్లా కుష్నపల్లి. చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయారని, తల్లిదండ్రులు అంటున్నారు. అఘోరి మాతగా మారితే తాము చేసేదేమీ లేదంటున్నారు.