US Bankrupt Elon Musk| ఆర్థిక సంకోభం, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోవడం వంటి సమస్యలతో అగ్రరాజ్యం అమెరికా కొట్టుమిట్టాడుతోంది. గత నాలుగేళ్లుగా ప్రెసిడెంట్ జో బైడెన్ నాయకత్వంలోని డెమొక్రాట్స్ ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే అమెరికా ప్రజలు ఈ సారి రిపబ్లికన్ పార్టీకి అధికారం అప్పగించారని విశ్లేషకులు అభిప్రాయం. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణం అమెరికా దేశ ఆదాయం భారీగా తగ్గిపోవడం.. మితిమీరిన ఖర్చులు చేయడం వల్లేనని.. ఇలాగే కొనసాగితే అతి త్వరగా అమెరికా దివాలా తీస్తుందని ప్రపంచంలోనే అత్యంత ధనికుడు, ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ హెచ్చరించారు.
ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ఎక్స్ పై ఒక అధికారిక పోస్ట్ చేశారు. “అమెరికా ప్రస్తుతం దివాలా తీసే దిశగా శరవేగంగా వెళుతోంది” అని రాశారు. అంతకు ముందు అమెరికా జాతీయ ఖర్చులు తగ్గించేందుకు అమెరికా తదుపరి అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ’ అనే ఒక మంత్రిత్వశాఖ సృష్టించారు. ఈ డిపార్ట్‌మెంట్‌కు బాధ్యతలు ఎలన్ మస్క్, భారత మూలాలున్న మరో బిజినెస్‌మెన్ వివేక్ రామస్వామికి అప్పగించారు.
Also Read: ట్రంప్ విజయంతో భారీగా పెరిగిన ఎలన్ మస్క్ ఆస్తులు.. ఎన్నికల తరువాత ఏకంగా 70 బిలియన్ డాలర్ల వృద్ధి
అయితే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ అధికారికంగా ట్విట్టర్ ఎక్స్‌లో అమెరికా ఆదాయం ఖర్చులకు సంబంధించి ఒక పోస్ట్ చేసింది. “2023లో అమెరికా ప్రభుత్వ ఆదాయం 4.47 ట్రిలియన్ డాలర్ల, కానీ ఖర్చు 6.16 ట్రిలియన్ డాలర్లు” అని ఆ పోస్ట్ లో ఉంది. ఈ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ ఎలన్ మస్క్.. అమెరికా దివాలా తీసే దిశగా శరవేగంగా వెళుతోంది అని రాశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే ప్రభుత్వం అనవసర అప్పులు, ఖర్చులు భారీగా చేస్తోందని.. ఇదంతా ప్రజల సొమ్ముతో జరుగుతోందని ఆరోపణలు చేశారు. తాను అధికారంలోకి రాగానే వీటిని పూర్తిగా తగ్గించేస్తానని హామీ ఇచ్చారు. ధరలు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఉపశమనం కలిగిస్తానని చెప్పారు. అమెరికా అప్పులు 35 ట్రిలియన్ డాలర్లకు (35 లక్షల కోట్లు) చేరాయి. ఈ అప్పులన్నీ అవసరమైతే బిట్ కాయిన్ ద్వారా తీర్చవచ్చని ప్రతిపాదన కూడా చేశారు.
పోర్బ్స్ పత్రిక రిపోర్ట్ ప్రకారం.. 2024 సంవత్సరం ప్రారంభంలోనే అమెరికా అప్పు 34 ట్రిలియన్ డాలర్లు. కోవిడ్ లాక్ డౌన్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికా అప్పులు పెరిగిపోయాయి. ఈ అప్పుల గురించి ట్రంప్ తన ప్రచారంలో ప్రస్తావిస్తూ.. ఒక ఇంటర్‌వ్యూలో.. “అప్పులు తిరిగి చెల్లించడానికి బిట్ కాయిన్ ఉపయోగించవచ్చు. దీని ద్వారా సమస్య తీరుతుందని అనుకుంటున్నా..” అని అన్నారు.
ఎన్నికల్లో ట్రంప్ విజయం తరువాత ఆయన సన్నిహితుడు.. ఎలన్ మస్క్ అమెరికా అప్పుల గురించి ఓ పోస్ట్ చేశారు. “ప్రభుత్వం అనవసర ఖర్చులు భారీగా చేయడం వల్ల అమెరికా దివాలా తీసేలా ఉంది. అప్పులు భారీగా పెరిగిపోవడంతో భవిష్యత్తులు అదే స్థాయిలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది” అని రాశారు.
ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కార్ల కంపెనీ డోజెకాయిన్ అనే క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేస్తుంది. అందుకే ఆయన అప్పులు తీర్చడానికి డోజెకాయిన్ క్రిప్లోని ఉపయోగించవచ్చు అని అభిప్రాయపడ్డారు.