Big Stories

TS Assembly : బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్‌ ఫైర్.. కేటీఆర్ కౌంటర్..

TS Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు వాడీవేడిగా సాగుతున్నాయి. తొలిరోజు అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదించగా.. మరో సభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి గవర్నర్ ప్రసంగంపై నేరుగా చర్చ చేపట్టారు.

- Advertisement -

అక్బరుద్దీన్ ఫైర్..
అసెంబ్లీలో కాసేపు బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారు..కానీ అమలు చేయరని ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం, మంత్రులను కలిసే అవకాశం కూడా లేదని.. కనీసం మీ చెప్రాసిని చూపిస్తే వారినైనా కలిసి సమస్యలపై మాట్లాడతామని అన్నారు. పాతబస్తీలో మెట్రో సంగతి ఏమైందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని నిలదీశారు. ఉర్ధూ రెండో అధికారిక బాష అయినా అన్యాయం జరుగుతోందని అన్నారు.

- Advertisement -

కేటీఆర్ కౌంటర్..
అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌ సబ్జెక్ట్‌ తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని కౌంటర్‌ ఇచ్చారు.

సమావేశాలపై కేసీఆర్ క్లారిటీ..
అసెంబ్లీ సమావేశాలను 25 రోజులపాటు నిర్వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. కనీసం 20 రోజులైన సభ జరపాలని ఎంఐఎం కోరింది. అయితే శాసనసభలో బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ్యులకు వెల్లడించారు. ఈ నెల 6న బడ్జెట్‌ ప్రవేశపెడతామని తెలిపారు. ఈ నెల 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగుతుందని… దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని వెల్లడించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ, 12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగుతుందని కేసీఆర్‌ సభ్యులకు వివరించారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News