E-Paper
Advertisement

Akbaruddin Owaisi: సీఎంల దగ్గరకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరకు వస్తారు, అదే మా పవర్: అక్బరుద్దీన్ ఓవైసీ

Akbaruddin Owaisi: సీఎంల దగ్గరకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరకు వస్తారు, అదే మా పవర్: అక్బరుద్దీన్ ఓవైసీ
Advertisement

మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) సీనియర్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ సెగ పుట్టించేలా ఉన్నాయి. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో ఎంఐఎం పార్టీ ప్రాముఖ్యతను.. తమ పట్టును చాటిచెప్పేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఏ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పరిస్థితులే ముఖ్యమంత్రులను తమ వద్దకు తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మా మద్దతు లేనిదే గెలుపు సాధ్యమా?

Advertisement

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితాలను ఆయన ప్రస్తావించారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా?’ అని ప్రశ్నించిన అక్బరుద్దీన్, క్షేత్రస్థాయిలో తమకున్న బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. అధికారంలో ఎవరున్నా.. తమ పార్టీ సహకారం లేకుండా ముందుకు సాగడం అంత సులభం కాదని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు.

రెడ్డి అయినా, రావు అయినా రావాల్సిందే..

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే సామాజిక వర్గాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ‘ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వారు రెడ్డి అయినా, రావు అయినా.. చివరకు మా దగ్గరకు రావాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార పక్షం ఏదైనా, ఎంఐఎం మద్దతు అనేది కీలకంగా మారుతుందని.. తమను కాదని ఎవరూ రాజకీయం చేయలేరని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. తాము ఎవరి వద్దకు వెళ్లమని.. అవసరమే నాయకులను పాతబస్తీ వైపు నడిపిస్తుందని ఆయన గంభీరంగా పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం

రాబోయే మున్సిపల్ ఎన్నికల విషయంలో కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ.. ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా కరీంనగర్ వంటి నగరాల్లో ఎంఐఎం అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, మున్సిపల్ పీఠాలపై తమ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం అంటే కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన పార్టీ కాదని, రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటామని ఆయన తెలిపారు.

పార్టీ కేడర్ అంతా ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి మరీ..

ALSO READ: CM Revanth Reddy: కేటీఆర్ మాటలు డ్రగ్స్ తీసుకున్నట్లే ఉన్నాయి.. వారిది గంజాయి బ్యాచ్.. రేవంత్ ఘాటు కౌంటర్!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×