BigTV English

Weather: ఎండా-వానా.. మిక్స్‌డ్ వెదర్‌తో జర జాగ్రత్త..

Weather: ఎండా-వానా.. మిక్స్‌డ్ వెదర్‌తో జర జాగ్రత్త..
summer rain

Weather: ఈ ఎండాకాలం దారుణంగా ఉంది. ఓ వైపు ఫుల్‌గా ఎండకొడుతోంది. మరోవైపు, సడెన్‌గా వాన పడుతోంది. వడగాల్పులు వీస్తున్నాయి. ఊదురుగాలులతో వడగళ్ల వాన కూడా పడుతోంది. ఇలా వారం వారం.. ఎండా, వానా.. మార్చి మార్చి మటాష్ చేస్తున్నాయి. ఇదేం వాతావరణం? మునుపెన్నడూ లేని డేంజర్ వెదర్?


అసలే రోహిణీ కార్తె. చాలాచోట్ల రోకళ్లు పగిలే ఎండ. పగటిపూట బయలకు వస్తే చర్మం మాడిపోతోంది. ఎండమంట సుర్రుమనిపిస్తోంది. మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని కూడా అంటుండటమే విచిత్రం. కాలం మారుతోందా? పోయే కాలం దాపురిస్తోందా?

తెలంగాణ, ఏపీలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరుగుతోంది. మధ్యాహ్నం ఇంతలా ఎండ కాస్తే.. సాయంత్రం సడెన్‌గా వాన కురువడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎండా వానలతో మన శరీరం వేడికి, చలికి తగ్గట్టు అడ్జస్ట్ కాలేక.. రోగ నిరోధక వ్యవస్థ కన్ఫ్యూజన్‌లో పడుతుందని.. ఇదే అదనుగా బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేస్తాయని చెబుతున్నారు. టైఫాయిడ్, సీజనల్‌ జ్వరాలు, గొంతు ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల వంటివి అధికంగా సోకే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వర్షం నీటిలో తడిచిన ప్రతీసారి మళ్లీ ఫ్రెష్‌గా స్నానం చేయాలని చెబుతున్నారు.


తీసుకునే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్రైడ్ ఫుడ్, జంక్‌ఫుడ్ మానేస్తే మంచిదని.. అప్పుడే వండిన
వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. నీరు, పళ్లరసాలు అధికంగా తాగాలని.. తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల.. ఇమ్యూనిటీని కాస్త పెంచుకోవచ్చని అంటున్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×