Rain Alert: రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. బంగాళఖాతాంలో మరో అల్పపీడనం ఏర్పడుతుండటంతో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనుంచి బయటకు వెళ్లకూడదని తెలిపారు.
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..
అయితే గత నాలుగు రోజులుగా వాన దేవుడు కాస్త బ్రెక్ వర్షాలకు బ్రేక్ ఇచ్చాడు.. కానీ మళ్లీ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలే పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. నేడు రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, మేడ్చల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇంతకముందు కురిసిన వర్షాలు సరిపోలేదన్నట్టు మళ్లీ ఇప్పుడు అల్పపీడనం వల్ల వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలపారు.
ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ అల్పపీడన ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు అధికారులు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పార్వతిపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నాలు చేయకూడదని, అలాగే చెట్లకింద కూడా ఉండకూడదని చెబుతున్నారు.
అల్లకల్లోలంగా మారిన రాజస్థాన్
రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు విపత్తుగా మారాయి. చాలా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయి. కొన్నింటి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.రాజస్థాన్ రాష్ట్రం సవాయ్ మాధోపూర్ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుర్వాల్ డ్యామ్ పొంగిపొర్లడంతో భారీ నాశనం జరిగింది. నీరు పొలాల మీదుగా ప్రవహించి గ్రామం వైపు రావడంతో అక్కడ అంతా అతలాకుతలమైంది. అనేక ఎకరాల పొలాలు నాశనమయ్యాయి. నీటి ప్రవాహం కారణంగా రెండు ఇళ్లు, రెండు దుకాణాలు రెండు దేవాలయాలు కూలిపోయాయి. నీరు గోతిలోకి ప్రవహించడంతో ఒక జలపాతంలా మారిపోయింది.
నీటి ప్రవాహనికి కూలిపోయిన రెండు ఇళ్లు, దేవాలయాలు
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సైన్యం సహాయక బృందాలు గ్రామంలో మోహరించాయి. పక్కనున్న ఇళ్లను ఖాళీ చేయించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మంత్రి కరోడి లాల్ మీనా సంఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. యంత్రాల సహాయంతో నీటిని మళ్లించేందుకు అధికారులను ఆదేశించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి!
రంగంలోకి దిగిన సైన్యం సహాయక బృందాలు
కోటా, బుండీ, సవాయ్ మాధోపూర్, ఝలావార్ జిల్లాలు అత్యంత ప్రభావితమయ్యాయి. కోటా జిల్లా డిగోడ్ సబ్‌డివిజన్‌లోని హరిజీ నియమోదా గ్రామం సహా 400 కంటే ఎక్కువ కచ్చా, పక్కా ఇళ్లు కూలిపోయాయి. శతాధిక ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ప్రజలను రక్షించేందుకు ఆర్మీ, జాతీయ మరియు రాష్ట్ర విపత్తు సహాయ బృందాలు పని చేస్తున్నాయి.