
Hyderabad latest news today(TS news updates) :
మంగళవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో డ్రైనేజ్‌లో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ చిన్నారి ప్రమాదానికి గురైన ఘటన సంబంధించి సీసీ దృశ్యాలు విడుదలయ్యాయి. బాలుడు పడిపోయే ముందు.. అక్కడ వ్యక్తి మ్యాన్‌హోల్ మూత తీశాడు. ఆ మరో వ్యక్తి అతడి చేత ఈ పని చేయించాడు. సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలున్నాయి. ఆ మ్యాన్‌హోల్ మూత తీసి కొంచెం దూరంలో పెట్టారు. ఆ తర్వాత కాసేపటికే బాలుడిలో మ్యాన్ హోల్ లో పడిపోయాడు.
బాచుపల్లిలోని సాయినగర్‌లో ఈ ఘటన జరిగింది. ఓ పెద్దాయన వెనుక నడుచుకుంటూ వచ్చిన నాలుగేళ్ల చిన్నారి మిథున్.. రెప్పపాటు వ్యవధిలో ఆ డ్రైనేజీలో పడిపోయి కొట్టుకుపోయాడు. ముందు నడుస్తున్న ఆ పెద్దాయనకు ఆ విషయం తెలీలేదు. ఆ చిన్నారి తన వెనుక వస్తున్నట్టు కూడా గుర్తించలేదు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని తురక చెరువు నుంచి బయటకు తీశారు.
ఆ రోజు భారీ వర్షానికి బాచుపల్లిలోని ఆ అపార్ట్‌మెంట్ ముందు కూడా భారీగా నీరు నిలిచిపోయింది. అదే ఆ చిన్నారి పాలిట శాపమైంది. ఇంతకీ ఆ మ్యాన్ హోల్ తెరిచింది ఎవరు..? తెరవమన్నది ఎవరు..? ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరు ? ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మ్యాన్ హోల్ మూత తీయడానికి కారకులుగా కాలనీ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్, వాచ్‌మెన్ భావిస్తున్న పోలీసులు.. వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ మ్యాన్ హోల్ తెరిపించిన వ్యక్తి ఈ వ్యవహారం ఏమి జరగనట్టుగా ఆ రోజు మాట్లాడారు. ఈ వ్యక్తి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వర్షాలు వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు… చిన్నారి బలయ్యాడంటున్నారు.
Pawan Kalyan: విశాఖ ఎంపీకి వార్నింగ్.. చర్చి ఆస్తుల దోపిడీపై పవన్ ఫైర్..