E-Paper
Advertisement

బోనాల పండగ ఎలా ప్రారంభమైంది? ఆషాఢ బోనాల వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలు

బోనాల పండగ ఎలా ప్రారంభమైంది? ఆషాఢ బోనాల వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలు
Advertisement

Bonalu festival significance: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల సంబరాలు రాష్ట్రమంతా కన్నుల పండగగా నిర్వహిస్తారు. ఏటా ఈ సమయంలో భాగ్యనగరం అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోతుంది. అయితే అత్యంత వైభవంగా జరుపుకునే ఈ బోనాల పండగ వెనక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. అసలు ‘బోనం’ అంటే ఏంటి? ఈ సాంప్రదాయం ఎలా ప్రారంభమైంది? దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యం , శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బోనం అంటే ఏంటి?

‘బోనం’ అనే పదం ‘భోజనం’ అనే సంస్కృత పదం నుంచి పుట్టిందని చెబుతారు. ప్రాకృతంలో ఇది బోనంగా రూపాంతరం చెందింది. గ్రామ దేవతలను, మాతృమూర్తులను ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించే నైవేద్యాన్నే ‘బోనం’ అంటారు. సాధారణంగా కొత్త మట్టి కుండలో లేదా రాగి పాత్రలో అన్నం, పాలు, బెల్లం, కొన్ని సార్లు పెరుగు వేసి వండుతారు. ఈ కుండను పసుపు, కుంకుమ, వేపాకులతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. కుండపైన చిన్న ప్రమిదను ఉంచి అందులో దీపం వెలిగిస్తారు. మహిళలు ఈ పవిత్రమైన బోనాన్ని తమ తలపై పెట్టుకుని, మేళతాళాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు సమర్పిస్తారు.

ఈ సాంప్రదాయం ఎలా ప్రారంభమైంది?

Advertisement

చారిత్రక ఆధారాల ప్రకారం బోనాల పండగకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయ రాజుల కాలం నుంచే ఈ సాంప్రదాయం కొనసాగుతున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో బోనాల జాతర విస్తృతంగా మారడానికి ప్రధాన కారణం 19వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన.

క్రీ.శ. 1813 సంవత్సరంలో హైదరాబాద్ , సికింద్రాబాద్ ప్రాంతాలను ‘ప్లేగు’ మహమ్మారి భయానకంగా చుట్టుముట్టింది. ఈ అంటువ్యాధి కారణంగా రోజూ వందలాది మంది  ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో.. ఇక్కడి సైనిక దళానికి చెందిన సురితి అప్పయ్య అనే భక్తుడు ఉజ్జయినికి వెళ్లినప్పుడు, అక్కడ కొలువైన మహంకాళి అమ్మవారిని ప్రార్థించాడు. తమ నగరంలో ప్లేగు వ్యాధిని తరిమికొడితే.. ఉజ్జయిని మహాకాళి రూపంలో ఇక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడట. అతని మొక్కుఫలితంగా నగరంలో ప్లేగు వ్యాధి ప్రభావం క్రమంగా తగ్గిపోయింది. దీంతో ప్రజలు అమ్మ వారిని తమ రక్షకురాలిగా భావించి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ప్రారంభించారు. నాటి నుంచి ఇది ఒక సంప్రదాయంగా మారి, నేడు తెలంగాణ రాష్ట్ర పండగగా ఘనంగా నిర్వహించబడుతోంది.

ఆషాఢ మాసంలోనే ఎందుకు ?

Advertisement

తెలుగు సంప్రదాయం ప్రకారం.. కొత్తగా పెళ్లైన కుమార్తె ఆషాఢ మాసంలో పుట్టింటికి రావడం ఆనవాయితీ. అలాగే జగన్మాత అయిన ఆ పరాశక్తి కూడా ఈ మాసంలో తన భక్తులను చూడటానికి భూమిపైకి, అనగా తన పుట్టింటికి వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే అమ్మవారిని కన్నబిడ్డలా, సొంత కూతురిలా భావించి బోనం, పసుపు, కుంకుమ,చీర,సారె సమర్పించి భక్తితో పూజిస్తారు.

దీని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ఆషాఢ మాసంలో వాతావరణ మార్పుల వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి ఆచారంలో భాగంగా వాడే వేపాకులు, పసుపు అద్భుతమైన యాంటీసెప్టిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి క్రిమిసంహారకాలుగా పనిచేసి ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుతాయి.

Also Read: లాల్ దర్వాజాలో బోనాల సందడి..అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు!

బోనాల పండగ విశిష్టత:

బోనాల పండగ కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది ప్రజలందరినీ ఏకం చేసే సామాజిక వేడుక. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి వద్ద ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని ఇలా నగరంలోని ప్రతి గల్లీలోనూ వైభవంగా జరుగుతాయి. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, ఆఖరున జరిగే భవిష్యవాణి (రంగం) ,ఘటాల ఊరేగింపు ఈ పండగ ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల పండగ నేటికీ కొనసాగుతోంది.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×