BigTV English

VBIT: వీబీఐటీ విద్యార్థినులను వేధించింది వీడే.. విజయవాడ నుంచి హ్యాకింగ్!

VBIT: వీబీఐటీ విద్యార్థినులను వేధించింది వీడే.. విజయవాడ నుంచి హ్యాకింగ్!

VBIT: వీడు మామూలోడు కాదు. పేరు ప్రదీప్. అమ్మాయిలను వేధించిన సైకో. అలాగని ఏ ఈవ్ టీజింగో, ర్యాగింగో కాదు. ఏకంగా మొబైల్ ఫోన్స్ హ్యాకింగ్. హైదరాబాద్ లో మంచి పేరున్న వీబీఐటీ ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థినులను టార్గెట్ చేశాడు. పలువురి ఫోన్లను హ్యాక్ చేశాడు. వాట్సాప్ డీపీల నుంచి ఫోటోలు సేకరించి.. వాటిని అసభ్యంగా మార్ఫింగ్ చేసి.. వారికే పంపించాడు. తాను లింకు పంపిన వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వాలని.. వీడియో కాల్ చేయాలని టార్చర్ చేశాడు.


కట్ చేస్తే.. బాధిత అమ్మాయిలు కాలేజీలో ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాలు వారికి మద్దతుగా తరలివచ్చాయి. వీబీఐటీ కాలేజ్ లో పెద్ద ఎత్తున నిరసన జరిగింది. పోలీసులు ఎంటర్ అవగా.. వారికే సవాల్ విసిరాడు ఆ సైకో. పోలీసులు ఉన్నప్పుడే ఆ అమ్మాయిలకు ఫోన్లు చేయడం.. దమ్ముంటే తనను పట్టుకోమంటూ ఛాలెంజ్ చేయడం చూస్తుంటే వాడెంత తెగించాడో తెలుస్తోంది. అయితే, అక్కడున్నది హైదరాబాద్ పోలీస్. ఎలాంటి కేటుగాడైనా వారిముందు బలాదూర్.

ఒక్క రోజు గ్యాప్ లోనే నిందితుడిని పట్టుకున్నారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ అరాచకానికి పాల్పడిన ప్రదీప్ ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు కలిసి 8మంది వీబీఐటీ విద్యార్థినులను వేధించినట్టు గుర్తించారు. అయితే, ప్రస్తుతానికి ప్రదీప్ ఒక్కడే పోలీసులకు చిక్కాడు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.


కేవలం ఫొటోల మార్ఫింగ్‌ మాత్రమే కాకుండా ఆ విద్యార్థినుల మొబైళ్లలో ఉన్న పర్సనల్‌ డేటా మొత్తాన్ని నిందితుడు హ్యాక్‌ చేసినట్టు తెలిసింది. ఆ డేటా ఎక్కడుంది? ఇంకెవరికైనా ఇచ్చాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, హ్యాకింగ్ ఎపిసోడ్ తో వీబీఐటీ కాలేజీకి ముందుగానే సంక్రాంతి సెలవులు ప్రకటించింది యాజమాన్యం.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×