Big Stories

Owaisi says Muslim men use condoms: మోదీకి కౌంటర్, అవును కండోమ్స్ ఎక్కువగా..

Asaduddin Owaisi latest comments(TS today news): సార్వత్రికలకు ఎన్నికలకు ఒకవైపు పోలింగ్.. మరోవైపు నేతల మాటలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ముస్లింలను ఉద్దేశించి పరోక్షంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఫైరయ్యారాయన. కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే యువకులేనని తేల్చేశారు. ఈ విషయం చెప్పేందుకు తానేమీ సిగ్గుపడడం లేదన్నారు.

- Advertisement -

హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ సర్కార్ వద్దనున్న గణాంకాల ప్రకారం ముస్లిం జనాభా, సంతాన వృద్ధి తగ్గిందన్నారు. ముస్లింలు జనాభా పరంగా మెజార్టీగా మారుతారంటూ ప్రధాని నరేంద్రమోదీ హిందువుల్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. తమ కమ్యూనిటీపై ఇంకెంతకాలం ఇలాంటి భయాన్ని వ్యాప్తిస్తారని నిలదీశారు. మతం వేరైనప్పటికీ తామూ భారతీయులమేనని గుర్తుచేశారు.

- Advertisement -

ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార సభలో దేశ సంపదను ఎక్కువమంది పిల్లలకు పంచాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందంటూ చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు. ముస్లింలను ద్వేషించడమే మోదీ ఏకైక నినాదమని చురకలంటించారు. ఇంతకీ ప్రధాని నరేంద్రమోదీ ఏమన్నారు? కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను ముస్లింలకు పంచుతారని వ్యాఖ్యానించారు. దేశ సంపదపై మొదటి అధికారం ముస్లింలదే అని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారాయన.

ALSO READ: కాంగ్రెస్‌లోకి గుత్తా కొడుకు, రేపో మాపో..

ఏప్రిల్ 21న రాజస్థాన్‌లోకి బాంస్‌వాడా ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టపడి కూడబెట్టిన డబ్బును చొరబాటుదారులు, అధిక సంతానం ఉన్నవారికి ఇవ్వాలని చూస్తోందని దుయ్యబట్టారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఇప్పుడు అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో ఉందని, కాంగ్రెస్ మేనిఫెస్టోను చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్రమోదీ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News