E-Paper
Advertisement

Tarakarama: బాలయ్య థియేటర్ అదుర్స్.. తారకరామకు న్యూ లుక్..

Tarakarama: బాలయ్య థియేటర్ అదుర్స్.. తారకరామకు న్యూ లుక్..
Advertisement

Tarakarama: తారకరామ థియేటర్. ఆ సినిమా హాల్ ఈనాటిది కాదు. 1978లో ఎన్టీఆర్ నిర్మించారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల మూతపడింది. కట్ చేస్తే, చాలా ఏళ్ల తర్వాత కాచిగూడలోని తారకరామ థియేటర్.. ఏషియన్ తారకరామ పేరుతో రీఓపెన్ అయింది. థియేటర్ ను టోటల్ గా రెనోవేషన్ చేశారు. అల్ట్రా మోడ్రన్ గా తీర్చిదిద్దారు.

4కే ప్రొజెక్షన్‌, సుపీరియర్‌ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్‌ కెపాసిటీ ఉన్న థియేటర్‌ను.. ఆడియన్స్ కు లగ్జరీ ఫీల్ కలిగించేలా 590 సీట్లకు తగ్గించారు. రెక్లైనర్‌ సీట్స్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. డిసెంబరు 16 నుంచి హాలీవుడ్‌ మూవీ ‘అవతార్‌2’ను ప్రదర్శించనున్నారు. బుధవారం ‘ఏషియన్ తారకరామ’ను ప్రారంభించారు బాలకృష్ణ.

Advertisement

తారకరామ థియేటర్ చరిత్రను బాలకృష్ణ గుర్తు చేశారు. “అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా ఈ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది మాకు దేవాలయంతో సమానం. 1978లో ‘అక్బర్‌ సలీం అనార్కలి’ తొలి సినిమాగా ప్రదర్శించారు. ‘డాన్‌’ సినిమా ఇక్కడ 525 రోజులు ఆడింది. ఈ థియేటర్‌ వ్యక్తిగతంగా నాకు సెంటిమెంట్‌. మా అబ్బాయి ‘మోక్షజ్ఞ తారక రామ తేజ’ నామకరణాన్ని నాన్న ఎన్టీఆర్ ఈ థియేటర్‌లోనే చేశారు. ఏషియన్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి ‘ఏషియన్‌ తారకరామ’ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. మంచి కథలు రావాలి. సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి” అంటూ బాలకృష్ణ భావోద్వేగంతో మాట్లాడారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×