BigTV English

Balapur Ganesh 2024 Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఆల్ టైమ్ రికార్డు ధర

Balapur Ganesh 2024 Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఆల్ టైమ్ రికార్డు ధర

Balapur Ganesh 2024 Laddu Auction Live Updates: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. ఈ ఏడాది లడ్డూ వేలంలో కొత్త నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. లడ్డూ వేలంపాటలో పాల్గొనేవారు రూ.27 లక్షలు డిపాజిట్ చేయాలన్న నిబంధనను పెట్టారు. లడ్డూ వేలంపాటలో 23 మంది డిపాజిట్లు చేసి.. పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. గతేడాది బాలాపూర్ లడ్డూ వేలంపాట రూ.27 లక్షలు పలుకగా.. ఈ ఏడాది లడ్డూ వేలం రూ.30 లక్షలకు చేరుతుందని భక్తులు భావించారు.


బాలాపూర్ లడ్డూ వేలంపాట రూ.1116తో ప్రారంభమవ్వగా.. 23 మంది వేలంపాట దారులు పోటాపోటీగా లడ్డూ వేలం పాడారు. సింగిల్ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి రూ.30 లక్షల 1000 కి లడ్డూని దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూకి ఇదే ఆల్ టైమ్ రికార్డు ధర కావడం విశేషం. గతేడాది కంటే ఈ ఏడాది రూ.3 లక్షల ఒక వెయ్యి అధికంగా లడ్డూ ధర పలికింది.

Also Read: ఆల్‌టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే?


బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం హిస్టరీ

1994 లో మొదలైన బాలాపూర్ లడ్డూ వేలంపాట

1994లో రూ.450 పలికిన లడ్డూ ధర

1995లో రూ.4500 కి పెరిగిన లడ్డూ వేలం

2001 వరకూ వేలల్లోనే ఉన్న లడ్డూ ధర.. 2002 నుంచి లక్షల్లోకి మారింది.

2002లో కందాడ మాధవరెడ్డి రూ.1,05,000కు లడ్డూ వేలం పాడారు.

ఆ తర్వాతి నుంచి ఏడాదికి లక్షపెరుగుతూ వచ్చిన వేలం

2007లో రూ.4,15,000 పలికిన లడ్డూ ధర

2015లో రూ.10 లక్షల మార్క్ దాటి రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ

2016లో రూ.14,65,000 కు లడ్డూ వేలం పాడిన స్కైలాబ్ రెడ్డి

2017లో రూ.15,60,000 కు దక్కించుకున్న నాగం తిరుపతిరెడ్డి

2018లో రూ.16,60,000కు తేరేటి శ్రీనివాస్ గుప్తా, 2019లో కొలను రాంరెడ్డి రూ.17,60,000కు బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకున్నారు.

2020లో కోవిడ్ కారణంగా లడ్డూ వేలం రద్దు.. సీఎం కేసీఆర్ కు అందజేత

2021లో రూ.18,90,000కు ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు లడ్డూ వేలంపాడారు.

2022లో ఐదు లక్షలు పెరిగిన లడ్డూ ధర

2023లో రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ

 

 

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×