BigTV English

PM Modi: కేసీఆర్ చేసే 4 పనులు ఇవే.. కవితనూ టార్గెట్ చేసిన మోదీ..

PM Modi: కేసీఆర్ చేసే 4 పనులు ఇవే.. కవితనూ టార్గెట్ చేసిన మోదీ..
pm modi speech

PM Modi speech today(Telangana today news): వరంగల్ విజయ సంకల్ప యాత్రలో ప్రధాని మోదీ.. బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతానికి భిన్నంగా.. డైరెక్ట్ అటాక్ చేశారు. కవిత లిక్కర్ కేసునూ ప్రస్తావించారు. కేసీఆర్‌ సర్కారు చేసే పనులు ఇవేనంటూ.. 4 అంశాలపై పదునైన విమర్శలు చేశారు ప్రధాని మోదీ.


1– ఉదయం నుంచి సాయంత్రం వరకు మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే కేసీఆర్ చేసే మొదటి పని అన్నారు. అందుకోసం డిక్షనరీలో ఉన్న అన్ని పదాలను వాడుతున్నారు.

2– ఒకే కుటుంబం పెత్తనంలో తెలంగాణ మగ్గుతోంది. కేసీఆర్ ఫ్యామిలీ తాము తెలంగాణకు యజమానులం అనుకుంటున్నారు.


3– తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు.

4– తెలంగాణను కేసీఆర్ కుటుంబం అవినీతిలో ముంచేసింది. అవినీతి ఆరోపణలు లేకుండా ఒక్క ప్రాజెక్ట్ కూడా ఉండటం లేదు. కేసీఆర్ సర్కారే దేశంలో అందరికంటే అవినీతిమయంగా మారింది. ఆ అవినీతి ఢిల్లీ వరకూ వ్యాపించింది అంటూ పరోక్షంగా కవిత లిక్కర్ స్కాం గురించి ప్రస్తావించారు ప్రధాని మోదీ. గతంలో అభివృద్ధి కోసమో, నీటి ప్రాజెక్టుల కోసమో ఏదేని రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండేవని.. మొదటిసారి రెండు ప్రభుత్వాల మధ్య అవినీతి డీల్ నడిచిందంటూ.. బీఆర్ఎస్, ఆప్ సర్కారుపై ఫైర్ అయ్యారు.

అందుకే, దర్యాప్తు సంస్థలు కేసీఆర్ అవినీతిపై గురిపెట్టాయని.. నిరంతరం దాడులు చేస్తున్నాయని అన్నారు. వారి అవినీతి గుట్టు రట్టు అవడంతో.. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోందని మండిపడ్డారు. ఆ ఎత్తుగడలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు పీఎం మోదీ.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×