కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా తన పని మొదలు పెట్టిన తర్వాత ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువగా వినిపించేవి. కానీ తొలిసారిగా ఇప్పుడు పాజిటివ్ వైబ్ తో హైడ్రాపేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. హైడ్రా పనితీరుని అభినందిస్తూ వేలాదిమంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవను కూడా అభినందిస్తున్నారు. వీటన్నిటికీ కారణం బతుకమ్మ కుంట.
అక్రమార్కుల చెరనుండి చెరువులను కాపాడుతామని మాటిచ్చిండు..
నేడు నిజం చేసి చూపించిండురేవంతన్న విజన్ కు పర్ఫెక్ట్ ఉదాహరణ.. బతుకమ్మ కుంట పునరుద్ధరణ pic.twitter.com/ilfyuvRaZT
— Aapanna Hastham (@AapannaHastham) July 8, 2025
మారిన రూపురేఖలు..
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడా స్పష్టంగా కనపడుతోందని అంటున్నారు నెటిజన్లు. దీనికి తాజా ఉదాహరణగా బతుకమ్మ కుంటను చూపిస్తున్నారు. ఇది కళ్లముందు కనపడుతున్న మార్పు అని అంటున్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కుంటను ఆక్రమణల చెరనుంచి కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్(హైడ్రా) సాధించిన విజయాల్లో ఇది కూడా ఒకటి. బతుకమ్మ కుంటను కబ్జా కోరల్లోనుంచి రక్షించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైడ్రాకు సంబంధిత పత్రాలు అందజేయడంతో తొలి అడుగు పడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఈ కుంటను పరిశీలించి పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఈ కుంట స్థలం తమది అంటూ హైకోర్టుని ఆశ్రయించినా తుది తీర్పు హైడ్రాకు అనుకూలంగా వచ్చింది. దీంతో నేడు ఇది కొత్తరూపు సంతరించుకుంది.
కబ్జా కోరల్లో ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా చేశారో చూడండి. 👏👏❤️👌
హైడ్రాకు ముందు బతుకమ్మ కుంట చెరువు సరస్సు పునరుద్ధరణ పనులను చేపట్టింది. మొదటి రెండు ఫోటోలు హైడ్రా సరస్సు పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసిన బతుకమ్మ కుంట చిత్రాలు.
జూలై 7న బతుకమ్మ కుంట… pic.twitter.com/AJTXpdgEfm
— Vennela Kishore Reddy (@Kishoreddyk) July 8, 2025
అప్పుడు 20 ఎకరాలు..
దాదాపు 20 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో బతుకమ్మ కుంటగా ఉండేది. క్రమంగా కబ్జాల బారిన పడి అసలు కుంటే కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఇందులో కేవలం 6 ఎకరాలు మాత్రమే మిగిలుంది. దాన్ని కూడా కబ్జా చేయాలని చూశారు కొంతమంది. హైడ్రా చొరవతో దానికి బ్రేక్ పడింది. చెరువుని పునరుద్ధరించి అక్కడ పరిసరాల్ని పరిశుభ్రం చేశారు. దీంతో ఇప్పుడు బతుకమ్మ కుంట అందర్నీ ఆకట్టుకుంటోంది. గతంలో బతుకమ్మ కుంట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది.. అని పోలుస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నారు. బతుకమ్మ కుంటను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయి ఉంటే, ఈపాటికే అది పూర్తిగా కనుమరుగై పోయి ఉండేదని అంటున్నారు. అసలు బతుకమ్మ కుంట అనే జలవనరు కాలగర్భంలో కలసిపోయేదని, అది ఒక ప్రాంతం పేరుగా మాత్రమే మిగిలిపోయేదని చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంట చెరువును పునరుద్ధరించిన హైడ్రా మరియు రేవంత్ రెడ్డి గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు! మీ కృషితో మా సంప్రదాయ సంబరం మళ్లీ జీవం పోసుకుంది!
నిన్న BRS ప్రభుత్వం లో కబ్జాకు గురైన బతకమ్మ కుంట చెరువు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో పునరుద్దరణ.. ఇది కదా మార్పు అంటే.. pic.twitter.com/bUlc3NiEL9— Rajkiran (RK) ( TG) (@Rajkiran071989) July 8, 2025
సీఎం రేవంత్ చొరవ..
తెలంగాణలో 9 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఆక్రమణల తొలగింపుకి సిద్ధపడలేదు. పైగా బీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతోనే కొన్నిచోట్ల ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఈ ఆక్రమణలతో హైదరాబాద్ నగరం ముంపుబారిన పడుతోంది. ఏ చిన్న వర్షం వచ్చినా నగరంలో నీరు నిలబడుతోంది. నాళాలు, కుంటలు ఆక్రమించడంతో వర్షపునీరు పోయే దారిలేక రోడ్లు మునిగిపోయేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆక్రమణల తొలగింపుపై సీరియస్ గా దృష్టిపెట్టారు. విమర్శలు వస్తున్నా ఆయన ముందుకే వెళ్లడానికి నిర్ణయించారు. ఆ ఫలితాలు ఇప్పుడు కళ్లముందు కనపడుతున్నాయి. దీనితోపాటు మూసీ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కితే హైదరాబాద్ రూపు రేఖలు సమూలంగా మారడం ఖాయం అంటున్నారు.