Bharat Bandh: రేపు బ్యాంకులు, బీమా, పోస్టల్ తదితర రంగాలు బంద్ కానున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులపై అసంతృప్తితో పదికి పైగా కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. పలు ప్రభుత్వ రంగాలపై దీని ప్రభావం పడనుంది. బ్యాంకింగ్, పోస్టల్, విద్యుత్, బీమా లాంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన రాలేదు. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రవాణా అంతరాయం, నిరసనల కారణంగా కొన్ని స్కూళ్లు, కాలేజీల కార్యకలాపాలకు ఆటంకం కలిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
రేపు పదికి పైగా కేంద్ర ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, గ్రామీణ కార్మిక సంస్థలు కలిసి భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దాదాపు 25 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. అందుకే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోస్టాఫీసులపై ఎఫెక్ట్ ఉండనుంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రేపు అధికారికంగా హాలిడే గా ప్రకటించకపోతే, బ్యాంకులు సాధారణ రోజుల్లాగే పని చేయవచ్చు. కానీ సమ్మె వల్ల సిబ్బంది తక్కువగా ఉండొచ్చు. కాబట్టి బ్యాంక్‌లో క్యూలు, రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అత్యవసరమైన పని లేకపోతే, ఆ రోజు బ్యాంకుకు వెళ్లకుండా మరో రోజు ప్లాన్ చేసుకోవడం బెటర్.
ఇక, డిజిటల్ సర్వీసుల గురించి చెప్పాలంటే, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATM సర్వీసులు ఆ రోజు కూడా సాధారణంగా పని చేస్తాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం, బిల్లులు చెల్లించడం వంటివి సులభంగా చేయొచ్చు. కానీ చెక్ డిపాజిట్ చేయడం, క్యాష్ విత్‌డ్రా చేయడం, KYC అప్‌డేట్ వంటి బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన పనులైతే ముందు రోజు లేదా తర్వాత రోజు చూసుకోవాల్సి ఉంటుంది.
ALSO READ: BHEL Jobs: పది, ఐటీఐతో 515 ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్.. జాబ్ వస్తే రూ.65వేల జీతం భయ్యా
సమ్మె కారణంగా బ్యాంకులే కాదు, కొన్ని ఇతర సంస్థల్లోనూ అంతరాయం కలిగే అవకాశం ఉంది. అయితే, స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, బస్సులు, రైళ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, మార్కెట్లు వంటివి సాధారణంగా పని చేయనున్నాయి. కాబట్టి, రేపు బ్యాంక్ పని ఉంటే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి