E-Paper
Advertisement

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!
Advertisement

Indiramma Housing Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ సిటీలోని క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్ధిదారులకు కీలక ప్రకటన చేసింది తెలంగాణ హౌసింగ్ బోర్డు. అర్హులైన లబ్ధిదారులు తమ వాటా లక్ష రూపాయలు అక్టోబరు 9 లోపు చెల్లించాలి. గడువు లోపు డబ్బు చెల్లించని వారి అలాట్‌మెంట్ లెటర్లను రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్

హైదరాబాద్ సిటీలోని క్యూర్ ఏరియాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల లాటరీ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన లబ్ధిదారులకు తాత్కాలిక కేటాయింపు పత్రాలు జారీ చేసినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఆదివారం తెలిపింది. 5,501 మందికి ప్రొవిజినల్ అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేయగా, అందులో 3271 మంది అంటే దాదాపు 59.46 శాతం లబ్దిదారులు తమ చెల్లింపులు పూర్తి చేశారు.

శుక్రవారం లోపు డబ్బులు చెల్లించకుంటే ఇల్లు రద్దయ్యే ఛాన్స్!

Advertisement

మిగిలిన లబ్ధిదారులు వెంటనే స్పందించి గడువు లోగా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు పూర్తి చేయాలని తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వైస్-ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి. గౌతమ్ స్పష్టం చేశారు. ఇంకా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులు తమ తాత్కాలిక కేటాయింపులు రద్దు కాకుండా ఉండేందుకు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం లబ్ధిదారులు అధికారిక వెబ్‌సైట్ TGHB.Telangana.gov.in ను సందర్శించవచ్చు. లేకుంటే హౌసింగ్ బోర్డ్ కాల్ సెంటర్ నెం 040-24603572 ను సంప్రదించవచ్చు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్ధిదారులు

లక్ష చెల్లించడానికి గడువును హౌసింగ్ బోర్డు శుక్రవారం వరకు పొడిగించింది. లాటరీ ద్వారా ఎంపికైన దరఖాస్తుదారులకు నివాస అర్హత, ఆదాయ పరిమితి, కుటుంబానికి ఇప్పటికే ఇల్లు లేదా ప్లాట్ ఉందా? కుటుంబానికి ఒక దరఖాస్తు అనే నిబంధన, సమర్పించిన పత్రాల ధృవీకరణ వంటి అంశాలను తనిఖీ చేస్తూ పోస్ట్-వెరిఫికేషన్ నిర్వహించినట్లు తెలిపింది. అర్హత ప్రమాణాలను నెరవేర్చిన వారికి తాత్కాలిక కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.

Advertisement

ALSO READ: రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

గడువులోగా చెల్లించడంలో విఫలమైతే ఆయా లబ్దిదారుల కేటాయింపులు రద్దు చేయనుంది హౌసింగ్ బోర్డు. వెయిటింగ్ లిస్టులో సుమారు 35 వేల మంది దరఖాస్తుదారులకు కేటాయించనుంది. నవంబర్ నెలల్లో లాటరీ పద్ధతిలో కేటాయింపులు ఉంటాయని కమిషన్ వివరించారు.

Related News

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

Big Stories

Advertisement
×