E-Paper
Advertisement

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి
Advertisement

Thoopran Dairy: స్వేచ్ఛ బ్యూరో: తూప్రాన్ డెయిరీ తెలంగాణ పాడి రైతులకు ఆర్థిక భవిష్యత్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాను చేపట్టింది కేవలం డెయిరీ ప్లాంట్‌కు భూమిపూజ కాదని, ఇది తెలంగాణ పాడి రైతుల ఆర్థిక భవిష్యత్ అని, అన్ని గ్రామాల్లోని రైతులకు దిక్సూచిలాంటిదని కొనియాడారు. దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడితో అమూల్‌కు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ డెయిరీ ప్లాంట్‌ ఏర్పాటు కానుందని వివరించారు. తూప్రాన్‌లో డెయిరీ ప్లాంట్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం భూమిపూజ చేపట్టారు.

కేంద్ర మంత్రి మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 18 నెలల్లో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసుకుని, మహిళలు, యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రైతుల నుంచి పాలను సేకరించి మిల్క్ ప్రాసెసింగ్ చేయడం ద్వారా వ్యాల్యూ అడిషన్ పెరగనుందన్నారు. రైతుల నుంచి సేకరించిన పాలను విదేశాలకు ఎగుమతి చేయకుండా.. ఇక్కడే పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, ఐస్‌క్రీమ్, నెయ్యి వంటి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తారని వెల్లడించారు. రైతులంటే వరి, మిర్చి, పత్తి రైతులు మాత్రమే గుర్తుకు వస్తారని, కానీ భూమి ఉన్నా లేకపోయినా పాడి పరిశ్రమపై రైతు ఆధారపడి ఉపాధి పొందవచ్చన్నారు. భవిష్యత్తులో అనేక ప్రాంతాల నుంచి తూప్రాన్‌కు పాలు తీసుకురానున్నారని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైతులకు కష్టపడటం తెలుసని, ఉత్పత్తి చేయడం తెలుసని పేర్కొన్నారు.

కో ఆపరేటివ్ వ్యవస్థను ఉద్యమంలా పెంచుకోవాలి..

Advertisement

కానీ రైతు ఉత్పత్తులకు మార్కెట్ లేక, నిల్వ చేసుకునేందుకు స్టోరేజీ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, వ్యాల్యూ అడిషన్ చేయలేక అనేక ఇబ్బందులు పడుతుంటారన్నారు. చుక్క చుక్క కలిసి నదులైనట్టుగా రైతులందరూ ఏకమై సహకార సంఘంగా కలిసి పనిచేస్తే ఒక పెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సహకార సంఘాల్లో రాజకీయాలు ఎక్కువై నిర్వీర్యమయ్యాయని, ప్రస్తుతం సహకార సంఘాలు నామరూపాల్లేకుండా మారిపోయాయన్నారు. వాటిని మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. పంట ఉత్పత్తిదారుడు అయిన రైతే.. వ్యవస్థలో భాగస్వామి అయితే దళారుల దోపిడీ, అవినీతి, రాజకీయ నాయకుల పెత్తనం తగ్గుతుందన్నారు. రైతులందరూ కలిసి బలమైన సహకార వ్యవస్థగా ఏర్పడితే.. వచ్చే డబ్బు ఆ గ్రామంలోనే వినియోగించుకోవచ్చని, ఆ గ్రామంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తంచేశారు. సహకార సంస్థలు అనగానే మహారాష్ట్ర, గుజరాత్ పేర్లే గుర్తుకు వస్తాయని, తెలంగాణలో కూడా కో ఆపరేటివ్ వ్యవస్థను ఉద్యమంలా పెంచుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి వివరించారు. ఎవరికి వారు విడివిడిగా వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కాదని, కానీ సహకార సంఘంగా ఏర్పడితే ఎన్నో లాభాలు ఉంటాయన్నారు.

రోజుకు దాదాపు 50 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్

సహకార వ్యవస్థ ఎంతటి మార్పు తీసుకురాగలదో తెలుసుకోవాలంటే సబర్ డెయిరీ ప్రయాణాన్ని చూడాలని, 1964 నవంబర్ 27న 62 సంవత్సరాల కింద 19 సహకార సంఘాలతో ఈ డెయిరీ ప్రారంభమైందని, ఆ సమయంలో రోజుకు 5,100 లీటర్ల పాలు సేకరించేవారన్నారు. కానీ ఇప్పుడు రోజుకు దాదాపు 50 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ జరగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. దాదాపు 50 వేల మంది పాల ఉత్పత్తిదారులు భాగస్వామ్యమై ఉన్నారని, వీరిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారన్నారు. 2025-26లో రూ.10,500 కోట్ల వార్షిక టర్నోవర్ నమోదు చేసుకుందని, ఈ డెయిరీ ద్వారా పశువైద్యం అందించేందుకు వందలాది మంది వెటర్నరీ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు.

శ్వేత విప్లవం 2.0

ఇదిలాఉండగా శ్వేత విప్లవం 2.0 ద్వారా 2029 నాటికి దేశవ్యాప్తంగా 75,000 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణలో కూడా 1,525 కొత్త సహకార సంఘాల ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని రైతులు, ఆడబిడ్డలు సహకార సంఘాలుగా ఏర్పడాలని కోరారు. ప్రతి మహిళా సంఘానికి బ్యాంకులు రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. వాటితో పశువులను కొని పాల ఉత్పత్తి పెంచేవిధంగా డెయిరీ అభివృద్ధి చేయాలని, దీంతో మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. ఇవాళ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు అని, ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు నాలుగో వంతు భారత్‌లోనే జరుగుతోందని కిషన్ రెడ్డి వివరించారు. 2047 నాటికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రధాని మోడీ సంకల్పమని నొక్కిచెప్పారు. ఈ భూమి పూజలో రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎంపీ రఘునందన్ రావు, ​కంపెనీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 Also Read: ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

Tags

Related News

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

Big Stories

Advertisement
×