E-Paper
Advertisement

Beri Eshwar: నువ్వు నోటీస్ ఇస్తే.. నేను వివరణ ఇవ్వాలా.. డీసీసీ ప్రెసిడెంట్‌పై మాజీ సర్పంచ్ ఫైర్!

Beri Eshwar: నువ్వు నోటీస్ ఇస్తే.. నేను వివరణ ఇవ్వాలా.. డీసీసీ ప్రెసిడెంట్‌పై మాజీ సర్పంచ్ ఫైర్!
Advertisement

Beri Eshwar: స్వేచ్ఛ బ్యూరో: డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు భయపడేది లేదని మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు. పార్టీ విలువలు దిగజార్చే విధంగా బేరి ఈశ్వర్ వ్యవహరించారంటూ డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్ శనివారం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై బేరి ఈశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కడా పార్టీ విలువలు దిగజార్చే విధంగా వ్యవహరించలేదని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు వచ్చాయని, తాను సూచన మాత్రమే చేశానని తెలిపారు. ఆ విషయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసింది కూడా జంగయ్య యాదవ్ మోచేతి నీళ్లు తాగే వారేనని ఆరోపించారు. దానిని మాట్లాడుకుని సరిచేసుకోవాల్సింది పోయి తనకు నోటీసు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.

నోటీసు ఇచ్చే అధికారం..

తాను కూడా పార్టీలో సీనియర్ నాయకుడినేనని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉండి కూడా నాయకులతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉందని, పార్టీకి విధివిధానాలు ఉన్నాయని, ఆ విషయం జిల్లా అధ్యక్షుడికి తెలియకపోవడం శోచనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడికి షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం లేదని, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కేవలం పార్టీ క్రమశిక్షణ సంఘానికే ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి వద్దే తేల్చుకుంటానని బేరి ఈశ్వర్ స్పష్టం చేశారు.పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ప్రశాంతి రెడ్డి పీసీసీ సభ్యురాలిగా ఉండి, తన నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై డీసీసీ అధ్యక్షుడికి కాకుండా క్రమశిక్షణ సంఘం చైర్మన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయం కూడా జిల్లా అధ్యక్షుడికి తెలియకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

Advertisement

Also read: రూ.15వేల లోపు ది బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు చూస్తే షాక్ అవుతారు!

అధ్యక్షుడి పై ఆరోపణలు..

జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన నోటీసుకు తాను ఎలాంటి వివరణ ఇవ్వబోనని స్పష్టం చేశారు. తాను కూడా జిల్లా అధ్యక్షుడిపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిపై పలువురు ఆరోపణలు చేసినప్పటికీ వారికి నోటీసులు ఇవ్వకుండా, అణగారిన వర్గానికి చెందిన తనకే నోటీసు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చి తనకు ఆయుధం ఇచ్చినట్టేనని, జిల్లా అధ్యక్షుడిపై చర్యల కోసం పోరాటం చేస్తానని బేరి ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 299 డివిజన్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, జిల్లా obc సెల్ అధ్యక్షుడు రవి ముదిరాజ్, గడిల కృష్ణ రెడ్డి, ఆదిలక్ష్మి, విజయ్,కావేరి శేఖర్, అమరం సురేష్ రెడ్డి, సంపత్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Kissik Talks: ఈటీవీకి మరోబిడ్డ.. ఆ సీరియల్ వల్లే బ్యాన్ చేసే పరిస్థితి.. నిజం బయటపెట్టిన సోనియా!

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×