Big Stories

Bhatti Vikramarka: త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Comments On Farm Loan Waiver: త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 9 2023 లోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. ఐదేళ్లలో చేయలేదన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చామన్నారు. ఈ పథకంతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు కట్టిన ఎట్టిపరిస్థితుల్లో వృథా కాకూడదని ప్రతీ పైసా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామన్నారాయన.

- Advertisement -

ఇప్పటికే రైతు భరోసా మీద ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే అందులో ఎవ్వరి సొంత నిర్ణయాలు ఉండవని.. అన్ని జిల్లాల ప్రజలందరితో చర్చించిన తర్వాత నివేదికి తయారు చేస్తామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ నివేదిక ప్రవేశపెట్టి దానిపై చర్చించిన తర్వాత విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణలో సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచాలన్నదే తమ కోరిక అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Also Read: వచ్చామా.. వెళ్లామా అన్నట్టు పనిచేస్తే కుదరదు: అధికారులకు సీఎం వార్నింగ్

ఇప్పటికే రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌‌గా వ్యవహరించనుండగా, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉండనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News