E-Paper
Advertisement

బయట కనిపిస్తే వార్నింగే.. పర్యావరణం కోసం ఓ సర్పంచ్ సాహోసోపేత అడుగు..!

బయట కనిపిస్తే వార్నింగే.. పర్యావరణం కోసం ఓ సర్పంచ్ సాహోసోపేత అడుగు..!
Advertisement

Open Defecation: స్వేచ్ఛ బ్యూరో: బహిర్బూమి రహిత గ్రామమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని బీరెల్లి గ్రామ సర్పంచ్ కవిత రాధాకృష్ణారెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లి గ్రామంలో పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణాన్ని పెంపొందించేలా గ్రామంలోని ప్రజలు బహిరంగ మల విసర్జనకు వెళ్లకుండా గ్రామ సభలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. అందుకు అనుగుణంగా గ్రామంలోని ప్రజలకు బహిరంగ విసర్జన వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తూ గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి సర్పంచ్ కవిత రాధాకృష్ణారెడ్డి ప్రచార నిర్వహించి వాల్ పోస్టర్లు అతికించారు.

Also Read: రెండేళ్లలో అధికారంలోకి వస్తాం.. ముందుంది ముసళ్ల పండగ.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్!

15 రోజులలో..

Advertisement

బయటికి పోవడానికి అలవాటు పడ్డ వారికి వీధుల గుండా వేకువ జామున కాపు కాసి మరీ వారిని ఇంటిదగ్గర మరుగుదొడ్లను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. మరుదొడ్లు లేని వారికి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 15 రోజులలో వారి ఇళ్లకు నిర్మించేలా కృషి చేస్తున్నారు. రానున్న రోజులలో 100% బహిర్భూమి విసర్జనను నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. జిల్లాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తద్వారా కుటుంబాలు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వారమవుతామన్నారు.

Also Read: తెలంగాణలో కీలక పరిణామం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా.. కోదండరాం, మంత్రి అజారుద్దీన్!

Related News

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. గాంధీభవన్‌ పూజలో మాణిక్‌రావు ఠాక్రే ప్రత్యక్షం, మార్పు ఖాయమా?

దళితుల ఓట్ల కోసమే BRS వాడకం.. శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే: పీసీసీ చీఫ్

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!

గిరిజనుల వైపు గులాబీ చూపు.. బీఆర్ఎస్ కొత్త పొలిటికల్ గేమ్!

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్‌దే సుప్రీం రోల్.. అసలేం జరుగుతోంది?

ఏ పార్టీలోకి వెళ్తే ఫ్యూచర్ ఉంటది? గ్రామీణ యువత పొలిటికల్ స్కెచ్!

Big Stories

Advertisement
×