CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో.. నేతన్నలకు అంతే ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సభలో సీఎం మాట్లాడారు.
‘2001 సంవత్సరంఅలో బీఆర్ఎస్ కు పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీ. బీఆర్ఎస్ కు నీడ కల్పించిన కొండా లక్ష్మణ బాపూజీకే నీడ లేకుండా చేశారు. ఆయన చనిపోతే కేసీఆర్ కనీసం సంతాపం ప్రకటించలేదు. త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ బాపూజీ. బీఆర్ఎస్ నేతలు బతుకమ్మ బకాయిలు పెట్టిన వారిని ఇబ్బంది పెట్టారు. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో.. నేతన్నలకు అంతే ప్రాధాన్యత ఇస్తాం. బతుకమ్మ బకాయిలు పెట్టిన వారిని ఇబ్బంది పెట్టారు. 65 లక్షల స్వయం సహాయక మహిళా సభ్యులకు చీర, సారె పెడుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘కాంగ్రెస్ అగ్రనేత ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చాం. బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేని వారి లెక్కలు తప్పని మాట్లాడుతున్నారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే.. ప్రధాని మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ కులగణన లెక్కలు తప్పని ఆరోపిస్తున్నాయి. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోంది’ అని సీఎం చెప్పుకొచ్చారు.
కేసీఆర్ లెక్కల ప్రకారం.. ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నత కులాలు 15.28 శాతం మాత్రమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలి. ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు’ అని సీఎం కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమంలో మరో కీలక వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని సీఎం అన్నారు. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ని ఖతం చేశాడని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: weavers loan waiver: నేతన్నలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్..
ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే 600 కోట్ల విలువైన 1కోటి 30 లక్షల చీరల ఆర్డర్లు నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని చెప్పారు. కోటి రూపాయలతో షోలాపూర్ లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.