weavers loan waiver: నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారి రుణమాఫీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేతన్నలకు సంబంధించిన రుణమాఫీ జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణాలు తీసుకున్నవారికి ఇది వర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.33 కోట్లు రుణమాఫీ చేస్తూ జీవోను రిలీజ్ చేసింది. ఈ స్కీం ద్వారా చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,20,000 జీతం.. రేపే లాస్ట్ డేట్
ఇదిలా ఉండలా.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పద్మశాలీలపై సీఎం వరాలు కురిపించారు. పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకూ అంతే ప్రాముఖ్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు
పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ ముందుటారని సీఎం కొనియాడారు. పద్మశాలీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఫైరయ్యారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది వాస్తవమని చెప్పారు. ఆలె నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా చేస్తే.. కేసీఆర్ అనే ధృతరాష్ట్రుడు ఆయన పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేసుకోవడమే కాకుండా ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.