E-Paper
Advertisement

Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Advertisement

Ramchander Rao: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడం, అవమానించడమే అవుతుందని బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్పీకర్ ది ప్రజా వ్యతిరేక తీర్పు అని పేర్కొన్నారు. ఒక్కరేమో ఒక్క పార్టీ సింబల్ పై పోటీ చేశారని, ఇంకొకరు ఆ పార్టీకి ప్రచారం చేశారన్నారు.

Also Read: Arjun Kalyan: బిబి జోడి 2 పై అర్జున్ కళ్యాణ్  కామెంట్స్..అంత వాళ్ళు చెప్పినట్టే నడుస్తుందా?

రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి 

Advertisement

ప్రజలు ఇదంతా చూశారని రాంచందర్ రావు తెలిపారు. దానం, కడియం అనర్హతపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే తీర్పుగా ఆయన పరిగణించారు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని, ఆ సమయంలో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, ఈ అంశంపై రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలోనే అదే యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితుల్లో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే అవుతుందన్నారు. ఈ తీర్పుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు రాంచందర్ రావు స్పష్టంచేశారు.

Also Read: IPL 2026 schedule: ఐపీఎల్ 2026 తొలి ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..RCB, SRH మ‌ధ్య‌నే తొలి మ్యాచ్

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×