BigTV English

Alleti Maheshwar Reddy Comments: అందరూ బెదిరించే వాళ్ళే! ప్రభుత్వాన్ని కూల్చడం అంత తేలికా?

Alleti Maheshwar Reddy Comments: అందరూ బెదిరించే వాళ్ళే! ప్రభుత్వాన్ని కూల్చడం అంత తేలికా?

Alleti Maheshwar Reddy Comments


బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి. ఏం జరుగుతుందో తర్వాత చూడండి. తలుచుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. ఇలా సాగిపోయింది ఆయన స్వీచ్ లాంటి వార్నింగ్.. ఇప్పుడే కాదు.. టూడేస్ బ్యాక్ కూడా ఇలాంటి స్టేట్‌మెంట్సే ఇచ్చారు ఏలేటి. ఒకసారి అప్పుడేమన్నారో కూడా చూసేయండి. ఇలా సాగుతున్నాయి బీజేపీ నేతల వ్యాఖ్యలు.. ఒకసారేమో రెండు రోజుల్లో కాంగ్రెస్‌ ఖాళీ అంటారు. మరోసారేమో రెండేళ్లలో బీజేపీ సర్కారే వస్తుందంటున్నారు. ఈ వ్యాఖ్యలతో ఏం సందేశమిస్తున్నారన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు.


ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో వలసల కాలం కంటిన్యూ అవుతోంది. ఎన్నికల వేళ చాలా మంది నేతలు.. తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ అవుతున్నారు. పొలిటికల్ ఫ్యూచర్‌కు ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా చేరే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూపై రెస్పాండ్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్‌ఎస్‌తో పాటు.. బీజేపీ కూడా ఖాళీ అవుతుందన్నారు ఆయన.

Also Read: ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరాకు 8 రోజులు సెలవులు

కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపైనే రియాక్ట్ అయ్యారు ఏలేటి.. మరి ఇది ఆ నేతల చాటు మాటు వ్యవహారాలను కవర్ చేసుకునే ఉద్దేశమా? లేక నిజంగానే తెరవెనుక మంతనాలు ఏమైనా చేస్తున్నారా?
అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే అశ్వత్థామ హతః కుంజరహ.. అన్నట్టుగా ఆయన కానీ మేము అలా చేయమంటూ ఓ చిన్న మెలికను పెట్టేశారు..

అసలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చాలి.. ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని లాక్కోవడం సరైన పద్దతేనా? అనేది బీఆర్ఎస్‌, బీజేపీ నేతలకే తెలియాలి. నిజానికి రేవంత్ సర్కార్ ఏర్పడిన తొలి రోజుల్లోనే.. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ నేతలు ఈ వ్యాఖ్యలను ప్రమోట్ చేశారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్‌ అయ్యింది. బీఆర్‌ఎస్‌ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడదే రాగాన్ని మళ్లీ బీజేపీ ఎత్తుకోంటోంది. మాములుగానే బీజేపీ, బీఆర్ఎస్‌ ఒక్కటనే ప్రచారం ఉంది. ఇప్పుడీ వ్యాఖ్యలు చూస్తుంటే.. రేవంత్ సర్కార్‌ను ఇరుకునే పెట్టే బాధ్యత ఇప్పుడు బీజేపీ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

రాజకీయాల్లో ఉండాల్సింది ఆలోచన కానీ.. ఆవేశం కాదు. ఉండాల్సింది ఆత్మవిశ్వాసం కానీ.. అహంకారం కాదు. ప్రభుత్వాలను అసలు మార్చడం ఎందుకు అనేదే అసలు ప్రశ్న. మహారాష్ట్రలో మారలేదా.. కర్ణాటకలో సాధ్యం కాలేదా? అంటే అక్కడి పరిస్థితులు వేరు.. తెలంగాణ పరిస్థితులు వేరు. రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఇప్పటికే తెలంగాణ ప్రజల ఆమోదముద్ర పడింది. పార్టీపై కంట్రోల్ ఉంది.. నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఉన్న అంతర్గత వివాదాలను కూడా సక్సెస్‌ఫుల్‌గా పరిష్కరించారు..
సో.. తెలంగాణలో అలాంటి సీన్‌ కనిపించడం లేదు.

అధికారం కోసం తహతహలాడే నేతలు.. ప్రజల కోసమే మా తాపత్రయం అనే కబుర్లు చెప్పకూడదు. ప్రతి ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలు గెలిచినట్లే.. తాము గెలవలేదు కాబట్టి ప్రజలు గెలవలేదని.. అందుకే బ్యాక్‌ డోర్ పాలిటిక్స్‌ చేసి అధికారాన్ని దక్కించుకుంటే.. అది ప్రజల తీర్పును అవమానించినట్టే.. ఇప్పటికైనా విపక్ష నేతలు ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×