BigTV English
Advertisement

SRH vs GT, IPL 2024 : గుజరాత్ టైటాన్స్ హిట్టా? ఫట్టా? నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్

SRH vs GT, IPL 2024 : గుజరాత్ టైటాన్స్ హిట్టా? ఫట్టా? నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ తో మ్యాచ్

Gujarat Titans vs Sunrisers Hyderabad


GT vs SRH – IPL 2024 Today Match Prediction: ఐపీఎల్ 2024 సీజన్ లో 12వ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 3 మ్యాచ్ లు జరిగాయి. వాటిలో రెండు గుజరాత్ గెలిచింది. ఒకటి హైదరాబాద్ విజయం సాధించింది.

హైదరాబాద్ సన్ రైజర్స్ అనేసరికి అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కి హార్ట్ బ్రేక్ స్ట్రోక్ ఇచ్చారు. దీంతో హైదరాబాద్ తో కొంచెం వళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు గుజరాత్ వంతు వచ్చింది.


ఈసారి వీరికెలా వడ్డిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ ఒక మ్యాచ్ నెగ్గి, ఒకటి ఓడి మూడో మ్యాచ్ ఆడుతున్నారు. హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. రెండు జట్లు కూడా చెరో రెండు పాయింట్స్ తో ఉన్నాయి. కాకపోతే నెట్ రన్ రేట్ ని బట్టి హైదరాబాద్ టేబుల్ లో 4వ స్థానంలో ఉంటే, గుజరాత్ 7వ స్థానంలో ఉంది.

Also Read:కేఎల్ రాహుల్ తప్పుకున్నాడా? తప్పించారా? 

హైదరాబాద్ లో ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్ క్రమ్, క్లాసెన్, రాహుల్ త్రిపాఠి వీళ్లంతా అరవీర భయంకరంగా ఆడుతున్నారు. వీరిని నిలువరించడానికి గుజరాత్ నుంచి చూస్తే ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తదితరులు ఈ విధ్వంసకారులను ఎంతవరకు ఆపుతారనేది సందేహాస్పదంగా ఉంది.

గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్  విషయానికి వస్తే గిల్, డేవిడ్ మిల్లర్, వ్రద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్ తదితరులపై ఆధారపడింది. అయితే గత రెండు సీజన్లుగా వీరే గుజరాత్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లారు. అందుకని ఈ జట్టుని తక్కువగా అంచనా వేయడానికి లేదని అంటున్నారు.

మరి వీరిని కంట్రోల్ చేయడానికి హైదరాబాద్ దగ్గర చూస్తే భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్ , మయాంక్, ఉమ్రాన్ లాంటి వాళ్లున్నారు. వీరిలో భువనేశ్వర్ తేలిపోవడం జట్టుకి ఆందోళనగా ఉంది. మొత్తానికి రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగానే ఉన్నట్టుగా ఉంది.

Related News

Virat Kohli: 6 గురు అమ్మాయిల‌తో విరాట్ కోహ్లీ ఎ**ఫైర్లు..లిస్ట్ రోహిత్ శ‌ర్మ భార్య కూడా ?

Sara -Shubman Gill: బ‌ట్ట‌లు విప్పి చూపించిన గిల్‌…బిల్డ‌ప్ కొట్ట‌కు అంటూ సారా సీరియ‌స్!

Hardik Pandya: ప్రియురాలి కారు కడుగుతున్న హార్దిక్ పాండ్యా…ముద్దులు పెడుతూ మ‌రీ !

Haris Rauf: హారిస్ రవూఫ్ పై ICC బ్యాన్..సూర్య‌కు కూడా షాక్‌

RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

Womens World Cup 2025: హ‌ర్ధిక్ పాండ్యాను కాపీ కొడుతున్న లేడీ బుమ్రా

PM Modi: వరల్డ్ కప్ విజేతలకు PM మోడీ బంపర్ ఆఫర్.. డైమండ్ నెక్లెస్​ల బహుమతి!

SRH -IPL 2026: హైద‌రాబాద్ ఫ్యాన్స్ కు షాక్‌… కాటేర‌మ్మ కొడుకును గెంటేస్తున్న కావ్య పాప ?

Big Stories

×