E-Paper
Advertisement

మీ బుద్ధి మారదా అంటూ.. సొంత పార్టీ నేతలకు బీజేపీ బాస్ వార్నింగ్..!

మీ బుద్ధి మారదా అంటూ.. సొంత పార్టీ నేతలకు బీజేపీ బాస్ వార్నింగ్..!
Advertisement

BJP Leadership: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నప్పటికీ, పార్టీ నేతలు మాత్రం అందుకు తగినట్లుగా వ్యవహరించడం లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీలోని పలువురు నేతల శైలి, వ్యవహారతీరుపై ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారాన్ని చూసి ప్రజలు విసిగి వేసారిపోయారని, ఈ సమయంలో ప్రజలంతా కాషాయ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. నేతల్లో మాత్రం మార్పు రావడంలేదని పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నా అందుకోవడంలో సుముఖంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది ఎంతో బాధను కలిగిస్తోందని నాయకులకు వివరించినట్లు సమాచారం.

సమన్వయ లోపం..

తెలంగాణ ప్రజలు అధికారం అప్పగించేందుకు పూర్తి సుముఖతతో ఉన్నా.., నాయకులు మాత్రం ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారని రాంచందర్ రావు రంగారెడ్డి జిల్లా ప్రశిక్షణ తరగతుల్లో అసహనం వెళ్లగక్కారు. నేతల మధ్య సమన్వయ లోపం పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీలో పలువురు నేతల మధ్య ఉన్న మనస్పర్థలు కూడా దీనికి ఒక కారణంగా మారుతున్నాయని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు నేతలంతా ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేయాలని ఆయన సూచించారు. అందుకు నేతలంతా మనస్పర్థలను పక్కన పెట్టాలని సూచించారు. పార్టీలోని లీడర్లు తమ వ్యక్తిగత పట్టింపులు, అంతర్గత మనస్పర్థలకు చక్ పెట్టినప్పుడు అధికారంలోకి రావడం సులభమవుతుందని దిశానిర్దేశం చేశారు.

Advertisement

Also Read: తెలంగాణ మంత్రి వర్గ విస్తరనకు ఖర్గే గ్రీన్ సిగ్నల్.. చాన్స్‌దక్కే ముగ్గురు లీడర్లు వీళ్లే..!

పార్టీ ఎజెండా కంటే సొంత మైలేజ్..

టీబీజేపీలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాల వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోందని నాయకులు, కార్యకర్తలకు రాంచందర్ రావు హెచ్చరించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. ఇకపోతే.. వ్యక్తిగత కార్యక్రమాలపైనే శ్రద్ధపెడుతున్న పలువురు నేతల తీరును కూడా ఆయన ఎండగట్టారు. పార్టీ బలోపేతం కోసం ఉమ్మడిగా కలిసి పనిచేయాల్సింది పోయి, కొందరు నేతలు కేవలం తమ వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితమవ్వడంపై రాంచందర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఎజెండా కంటే సొంత మైలేజ్ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా మీడియా ఎదుట ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని నొక్కిచెప్పారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ ని ప్రజలతో పంచుకున్నట్లు నేతలు కూడా మీడియా ఎదుట పంచుకుంటే పార్టీకి నష్టం తప్పితే లాభం ఏమాత్రం ఉండదని స్పష్టంచేశారు. అందుకే నాయకులు మీడియా ముందో, బహిరంగంగానో తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడాదని సూచనలు చేశారు. బాధ్యతారాహిత్యంగా చేసే వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని మలిచారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు.

Advertisement

Also read: కేటీఆర్ నోట ఊహించని బూతులు.. కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్..!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×