BigTV English

Judala Samme: జూడాల సమ్మెకు బ్రేక్.. స్టై ఫండ్స్ పై హామీ ఇస్తారా ?

Judala Samme: జూడాల సమ్మెకు బ్రేక్.. స్టై ఫండ్స్ పై హామీ ఇస్తారా ?
Junior doctors strike in Telangana

Junior doctors strike in Telangana(TS today news):

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం జూడాలు చేపట్టబోయే సమ్మెకి బ్రేక్ పడింది. మూడు నెలలుగా స్టేఫండ్ అందకపోవడంతో సమ్మె చేసేందుకు వైద్య విద్యార్ధులు నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న హెల్త్ సెక్రటరీతో సమావేశం అనంతరం.. సమ్మె నిర్ణయంలో వెనక్కి తగ్గారు. స్టే ఫండ్స్ ప్రతిసారి ఎందుకు ఆలస్యం అవుతుందని జూడాలతో.. హెల్త్ సెక్రటరీ చర్చించారు. ఆరోగ్య శాఖ మంత్రితో జూడాల సమస్యను చర్చిస్తానని హెల్త్ సెక్రటరీ హామీ ఇచ్చారు. కాగా కొత్తగా ఆరోగ్య శాఖ టీం వచ్చిన నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ తెలిపారు.


ఈ క్రమంలోనే జూడాల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు స్పందించింది. మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. జూడాలతో చర్చలు జరపనున్నారు. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన స్టైఫండ్ బకాయిలు పై మంత్రి వైద్య విద్యార్ధులతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా విద్యార్ధులు ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రి ఫైర్ అయ్యారు. జుడాల సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది.

కాగా హౌస్‌సర్జన్లకు నెలకు 26 వేల రూపాయలు.. తొలి ఏడాది పీజీ స్పెషాలిటీ వారికి 58 వేల రూపాయలు.. రెండో ఏడాది వారికి 61వేల రూపాయలు.. మూడో సంవత్సరం వారికి 65వేల రూపాయలు.. సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు 92 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ప్రభుత్వం స్టైపెండ్‌ రూపంలో చెల్లిస్తోంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇప్పుడు విద్యార్ధులు అంతా అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.


రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న హౌస్‌సర్జన్లు సుమారు రెండు వేల ఐదు వందల మంది ఉండగా.. దాదాపు 4 వేల మంది పీజీ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు.. మరో 2 వేల మంది సీనియర్‌ రెసిడెంట్లు.. ఒక వెయ్యి ఐదు వందల మంది వరకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఆందోళన చేపట్టనుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

.

.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×