BigTV English

BREAKING: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్

BREAKING:  రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్

Telangana Govt: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సందేహాలు కొనసాగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీసీలకు 42 రిజర్వేషన్లు ఇవ్వాలని భారీగా డిమాండ్ వినిపిస్తున్న విషయం విదితమే. దీంతో తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేసింది. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ బడ్జెట్ సమావేశంలో చట్టం చేసి కేంద్రానికి పంపాలని చూస్తోంది.


ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని అన్నారు. పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 16 నుంచి 28 వరకూ ప్రభుత్వ సిబ్బంది కులగణన సర్వే నిర్వహించనుందని భట్టి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ రోజు సమావేశమైన విషయం తెలిసిందే. ఎన్నికల తేదిపై ఓ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. కానీ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి కులగణన చేస్తున్నట్లుగా ప్రకటించారు. కులగణలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కులగణన చాలా పకడ్బందీగా జరిగిందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అసెంబ్లీ కూడా ఆమోదం పొందింది. ఆ నివేదక ఆధారంగానే బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కూడా సమర్పించింది. అయితే, ఇప్పుడు మళ్లీ రీసర్వే అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది.


Also Read: BHEL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బెల్‌లో 655 పోస్టులు.. వీళ్లందరూ అర్హులే

కులగణనలో చాలా తప్పులున్నాయని ఇప్పటికే పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇక, ఇప్పుడు నిజంగానే సర్వే తప్పులు జరిగి ఉంటేనే మళ్లీ సర్వే చేస్తున్నదని పార్టీలు వాదించే అవకాశం ఉంది. 3.1 శాతం మంది సర్వేలో నమోదు చేసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు డబుల్ ఎంట్రీలు కూడా నమోదు చేసుకునే అవకాశం లేకపోలేదు. అప్పుడు సమస్య పెద్దగా అవ్వొచ్చు. అప్పుడు ఆధార్ కార్డు కచ్చితంగా ఇవ్వాలన్న రూల్ ఏమీ పెట్టుకోలేదు. దీంతో నమోదు చేసుకున్న వారు. చేసుకోను వారు ఎవరో అంచనా వేయడం కష్టంగా మారింది. ఈ నెల చివరి వరకు కులగణన జరగనుండగా.. మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. టెన్త్ ఎగ్జామ్స్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్పంచ్ ల సంఘం కోరిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×