BigTV English

BRS govt: గురివింద గులాబీ.. పదేళ్లు ఏం జరగన్నట్టుగా కబుర్లు.. ఆనాడు స్కూళ్లు, హాస్టళ్లలో ఏం జరిగింది?

BRS govt: గురివింద గులాబీ.. పదేళ్లు ఏం జరగన్నట్టుగా కబుర్లు.. ఆనాడు స్కూళ్లు, హాస్టళ్లలో ఏం జరిగింది?

పదేళ్లలో పిల్లల పాపాలు మర్చిపోయారా?
⦿ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగని దుష్ప్రచారం
⦿ రోజుకో బురద రాజకీయం.. ఫుడ్ పాయిజన్ ఘటనలపైనా అదే తీరు
⦿ కుట్ర కోణంగా భావిస్తున్న హస్తం నేతలు
⦿ పదేళ్లు ఏం జరగన్నట్టుగా బీఆర్ఎస్ కబుర్లు
⦿ ఆనాడు స్కూళ్లు, హాస్టళ్లలో ఏం జరిగింది..?


⦿ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల అవస్థలెన్నో!
⦿ ఒక్కో మార్పు తీసుకొస్తూ ఆ పాపాన్ని కడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
⦿ డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు.. ఫ్రీ కరెంట్ హామీ
⦿ అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం
⦿ డ్రాపవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక చొరవ
⦿ అయినా ప్రభుత్వంపై గులాబీ కుట్రలు
⦿ ఫుడ్ పాయిజన్ ఘటనలపై తప్పుడు ప్రచారాలు
⦿ పదేళ్లు విద్యార్థులను అరిగోస పెట్టింది బీఆర్ఎస్ కాదా?
⦿ డెంగ్యూ బారిన పడి చనిపోయిన పిల్లల పాపం మీది కాదా?
⦿ ఆనాడు ఫుడ్ పాయిజన్‌తో వేల సంఖ్యలో విద్యార్థులకు అస్వస్థత
⦿ వారానికో ఘటన.. పదుల సంఖ్యలో అనారోగ్యంపాలు
⦿ అయినా కూడా ఏం జరగలేదన్నట్టు కుట్రలు చెప్తే నమ్మేదెవరు?
⦿ స్కూళ్లు, హాస్టళ్లను నిర్లక్ష్యం చేసి మురికి కూపాలుగా మార్చింది మీరు కాదా?
⦿ అన్నంలో పురుగులు, కూరల్లో కప్పలు, బల్లులు ఈదింది మీ హయాంలోనే
⦿ చేయాల్సిందంతా చేసి గురుకులాల బాట అంటూ డ్రామాలెందుకు?
⦿ బీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్న కాంగ్రెస్ నాయకులు

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: BRS govt: ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. పదేళ్లు పాలించిన కేసీఆర్‌కు ఓ దండం పెట్టి, హస్తం గుర్తుకు ఓటేశారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు ఛాన్స్ ఇవ్వలేదు. కేసీఆర్ చూస్తే ఫాంహౌస్‌కు పరిమితం అయ్యారు. కేటీఆర్ మాత్రం ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దండయాత్ర మాత్రం చేస్తూ వస్తున్నారు. ఓవైపు ప్రజా పాలన అంటూ ప్రభుత్వం ఒక్కో శాఖలో మార్పులు చేసుకుంటూ వస్తోంది.


బీఆర్ఎస్ పదేళ్ల పాపాన్ని కడిగేస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతోంది. ఆర్థిక సమస్యలు ఉన్నా, అటు సంక్షేమానికి, ఇటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. అయినా కూడా ప్రభుత్వంపై రోజుకో కుట్ర చేసి బద్నాం చేయాలన్నదే కేటీఆర్ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా ఫుడ్ పాయిజన్ ఘటనలను కూడా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడుతున్నారు. వరుస ఘటనలపై అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో వేల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అవేం జరగనట్టుగా గురివింద కబుర్లు చెబితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సమస్య ఉంటే సూచనలు చేయాలి గానీ, రాజకీయం చేయడం తగదని హెచ్చరిస్తున్నారు.

విద్యాలయాల్లో రేవంత్ సర్కార్ మార్పులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యాలయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. యూనివర్సిటీల నుంచి కిందిస్థాయి ప్రాథమిక విద్య దాకా ప్రక్షాళన చేస్తోంది. ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచింది. గతంలో కాంగ్రెస్ పాలనలోనే ఇవి పెరిగాయి. మళ్లీ ఇన్నాళ్లకు రేవంత్ హయాంలో జరిగింది. స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఫ్రీ కరెంట్ హామీ ఇచ్చింది. యూనివర్సిటీలకు వీసీలను నియమించి ఉన్నత విద్యను గాడిలో పెట్టింది.

అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కుల, మతాల తేడాలు లేకుండా పిల్లలందరూ ఒకచోట చేరి ఆహ్లాదకర వాతావరణంలో మెరుగైన విద్య అభ్యసించేలా ప్రణాళికను అమలు చేస్తోంది. ఇలాంటి సమయంలో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంతో, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గురుకులాల బాట, సోషల్ మీడియాలో విమర్శల ఆట మొదలుపెట్టి రాజకీయం చేయడంపై కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు.

ఫుడ్ పాయిజన్ ఘటనలపై అనుమానాలెన్నో!
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. గురుకులాల్లో జరిగే కుట్రలను త్వరలో బయటపెడతామన్నారు. గురుకుల హాస్టల్స్ యాజమాన్యాలతో బీఆర్ఎస్ నాయకులకు పరిచయాలు ఉన్నాయని, త్వరలోనే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది అమాయక విద్యార్థులు అనారోగ్యం పాలై చనిపోయారని గుర్తు చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్ఎస్ ప్రవీణ్ గురుకులాల బాట కాకుండా ఫాంహౌస్ బాట పట్టాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని గురుకులాలకు పోతారని, అనుచరులకు భవనాలు కేటాయించి పెద్ద మొత్తంలో స్కామ్ చేశారని ఆరోపించారు. గురుకుల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని భ్రష్టు పట్టించింనందుకు వెళ్తున్నారా అంటూ ఫైరయ్యారు.

మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి మాట్లాడుతూ, ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ కనుసన్నల్లోనే కుట్రలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికార దాహం కోసం విద్యార్థుల ప్రాణాలు బలి చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రూ.23 వేల కోట్లు కేటాయించిందని వివరించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మాట్లాడుతూ, రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకులు ఎవరినైనా బలి చేస్తారని విమర్శించారు. అధికారులను పంపించి ఫాంహౌస్‌లో జరుగుతున్న కుట్రలను బయట పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఫుడ్ పాయిజన్ కంటే ముందు బీఆర్ఎస్‌కు చెందిన పత్రిక రిపోర్టర్, మరో ముగ్గురు అక్కడ భోజనం చేశారని, వారికి ఫుడ్ పాయిజన్ ఎందుకు కాలేదని అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టే వెంటనే స్పందిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేస్తున్నారు. టీపీసీసీ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ, బీఆర్ఎస్ హయాంలో కేవలం పది నెలల్లో 34 చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయన్నారు. ఆనాడు సర్కారు హాస్టళ్లలో 2147 విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు చెప్పారు.

Also Read: CM Revanth Reddy: రైతుల కన్నులో ఆనందం.. రేవంత్ వచ్చాడు మార్పు తెచ్చాడు

కేసీఆర్ పాలనలో లెక్కలేనన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు
2017లో 244 మంది (ఆస్పత్రి పాలైన విద్యార్థులు)
2018లో 135 మంది
2019లో 571 మంది
2020లో 102 మంది
2021లో 373 మంది

జులై 15, 2022
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత విద్యార్థులు భోజనం విషయంలో పెద్ద ఉద్యమమే చేశారు.

జులై 31, 2022 (ఒకే రోజు 3 ఘటనలు)
ఒక్క రోజే మూడు చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని బీసీ గురుకుల స్కూల్‌లో 40 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. తల్లిదండ్రులను పిలిచి పిల్లల్ని ఇంటికి పంపించారు. సిద్దిపేటలోని సాంఘీక సంక్షేమ గురుకుల స్కూల్‌లో 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మహబూబాబాద్ గిరిజన స్కూల్‌లో 38 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు.

ఆగస్ట్ 27, 2022
సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ గురుకుల పాఠశాలలో కులిషిత ఆహారం తిని 15 మంది అనారోగ్యం పాలయ్యారు.

సెప్టెంబర్ 6, 2022
వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట గిరిజన గురుకుల స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 40 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు.

సెప్టెంబర్ 20, 2022
కాగజ్ నగర్ మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయింది. 45 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలయ్యారు.

జనవరి 8, 2023
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గురుకుల స్టూడెంట్లు ధర్నా చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే, ప్రిన్సిపాల్, వార్డెన్, అటెండర్ వేధిస్తున్నారని వాపోయారు. అన్నంలో పురుగులు, వాన పాములు వస్తున్నాయని చెప్పారు.

ఫిబ్రవరి 19, 2023
ఖమ్మం జిల్లా మధిరలోని బీసీ గురుకుల బాలికల వసతి గృహంలో పాచిపోయిన కూరలు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు నిరసన తెలిపారు. కొందర్ని ప్రిన్సిపాల్ కొట్టడంతో 20 మంది స్టూడెంట్స్‌కు గాయాలు అయ్యాయి.

ఫిబ్రవరి 19, 2023
నిజామాబాద్ జిల్లాలో రెండు చోట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయారు. ఉట్నూరులో పదో తరగతి విద్యార్థిని కవిత తీవ్ర అనారోగ్యంతో మరణించింది. కుంటాల ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థిని భాగ్య శ్రీ చనిపోయింది.

మార్చి 9, 2023
మహబూబాబాద్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 51 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

ఏప్రిల్ 7, 2023
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మైనారిటీ గురుకులంలో పురుగుల అన్నం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు.

జూన్ 24, 2023
యాదాద్రి జిల్లా మోత్కురు మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల స్కూల్‌లో కలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు.

జులై 11, 2023
మల్లాపూర్‌లోని బీసీ వసతి గృహంలో పురుగుల అన్నం తింటున్నామని మీడియాకు ఫోటోలు పంపారు విద్యార్థులు. అన్నంలో వచ్చిన పురుగు, మల్లు ఫోటోలను పంపి తమ బాధను వివరించారు. జులై 12న వార్డెన్, అధికారుల తీరును ప్రశ్నిస్తూ పత్రికల్లో కథనాలు వచ్చాయి.

సెప్టెంబర్ 12, 2023
భీంగల్ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 103 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇదే పాఠశాలలో ఎలుకలు కొరికిన ఘటన అంతకుముందు వెలుగుచూసింది.

సెప్టెంబర్ 14, 2023
ఒకే రోజు మన్ననూర్, మిర్యాలగూడ గిరిజన వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూశాయి. 170 మంది విద్యార్థులను అంబులెన్సులు, లారీల్లో ఆస్పత్రులకు తరలించారు.

సెప్టెంబర్ 16, 2023
రంగారెడ్డి జిల్లా మంచాలలోని బీసీ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 30 మంది ఆస్పత్రిలో చేరారు. పాచిపోయిన పులిహోర పెట్టడం, అందులో పురుగులు ఉండడమే పిల్లల అస్వస్థతకు కారణమని తేలింది.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×