BigTV English

Railway Station Killer: ఒంటరిగా దొరికితే చాలు అత్యాచారం, హత్య, దోపిడీ.. తరువాత కడుపునిండా తిని..

Railway Station Killer: ఒంటరిగా దొరికితే చాలు అత్యాచారం, హత్య, దోపిడీ.. తరువాత కడుపునిండా తిని..

Railway Station Killer| గుజరాత్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం ఓ 19 ఏళ్ల యువతి అత్యాచారం, హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు. కానీ విచారణలో తెలిసిన విషయాలు రోమాలు నిక్కుపొడుచుకునేలా ఉన్నాయి. హంతకుడు చాలా ఒక కృూర మృగం అని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతను ఇలాంటి హత్యలు చాలా చేశాడని.. హత్య చేసిన తరువాత అదే ప్రాంతంలో కడుపునిండా తినడం.. మరో ప్రదేశానికి వెళ్లి ఇలాంటి ఘాతుకాలే చేశాడని తెలిసింది. కేవలం గత నెల రోజుల్లోనే నలుగురు మహిళలు హత్య చేశాడని వెల్లడించారు.


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రంలోని రోహ్తక్ జిల్లాకు చెందిన రాహుల్ కరంవీర్ జాట్ కొన్ని నెలల క్రితమే రాజస్థాన్ లోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అంతకుముందు ఒక దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవించాడు. ఆ తరువాత కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర లోని రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ఉన్న మహిళలను అదును చూసి హత్య చేసేవాడు. అవకాశం దొరికితే వారిపై అత్యాచారం చేసి, దోపిడీ చేసేవాడు.

నవంబర్ 14, 2024న గుజరాత్ లోని ఉడ్వాడ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ వద్ద ఒక మహిళ శవం లభించింది. దీంతో వల్సాడ్ జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్యకు ముందు మహిళపై అత్యాచారం జరిగిందన పోస్ట్ మార్టంలో తేలింది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు సంయుక్తంగా హంతకుడని పట్టుకోవడానికి గుజరాత్ లోని పలుజిల్లాల్లో దాదాపు 2000 సిసిటివి కెమెరాలు గాలించారు. ఒక సిసిటివి కెమెరాలో మృతురాలు కనిపించడంతో ఆమెను అనుసరిస్తూ వీడియోలను పరిశీలించగా.. ఒక యువకుడు అనుమాస్పదంగా కనిపించాడు. అతను హత్య తరువాత ఏమీ పట్టనట్లు హోటల్ కు వెళ్లి ప్రశాంతంగా భోజనం చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.


Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం

ఆ యువకుడే ఉడ్వాడ ప్రాంతంలోని ఒక హోటల్ లో వెయిటర్‌గా పనిచేసేవాడు. హత్య జరిగిన సమయంలో వేసుకున్న బట్టలే హోటల్ లో వేసుకుని ఉండడంతో హోటల్ లోని సిసిటివిలో చూసి పోలీసులు అతడిని గుర్తుపట్టారు. కానీ హంతకుడు ఒక చోట నుంచి మరో ప్రదేశానికి తరుచూ వెళ్లడంతో పట్టుకోవడం కష్టంగా మారింది. చివరి నవంబర్ 24న వల్సాడ్ రైల్వే స్టేషన్లో అతడిని పట్టుకున్నారు.

కానీ అతని గురించి విచారణ చేయగా.. అతను 5వ తరగతి వరకు చదువుకొని చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడని, అతని తల్లిదండ్రులు అతడిని ఇంటి నుంచి తరిమేశారని తెలిసింది. జోధ్ పూర్ సెంట్రల్ జైలులో దొంగతనం చేసిన నేరానికి శిక్ష అనుభవించి కొన్ని నెలల క్రితమే విడుదలయ్యాడు. ఆ తరువాత నాలుగు రాష్ట్రాల్లో అత్యాచారం, దోపిడీలు చేశాడు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా ఇటీవలే నవంబర్ 22న మరో యువతిని హత్య చేశాడు. అక్టోబర్ నెలలో మహారాష్ట్రలోని సోలాపూర్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఆ తరువాత బెంగాల్ రాష్ట్రంలోని హౌరా రైల్వే స్టేషన్ వద్ద కఠియార్ ఎక్స్‌ప్రెస్ వద్ద ఒక వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. కర్ణాటకలోని ముల్కి ప్రాంతంలో కూడా ఒక హత్య చేసినట్లు సమాచారం.

“ఉడ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళ రాత్రివేళ ట్యూషన్ చెప్పి ఇంటికి వస్తుండగా.. నిందితుడు ఆమెను హత్య చేసి ఆ తరువాత మృతదేహంపై అత్యాచారం చేశాడు. నిందితుడు రాహుల్ కరంవీర్‌ని అరెస్టు చేశాక అతడి ఫొటోని పోలీస్ డేటాబేస్ లో నేరస్తులతో పోల్చి చూస్తే.. అతను జోధ్ పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడని తెలిసింది. దీంతో అతని క్రిమినల్ ప్రొఫైల్ అంతా తెలుసుకున్నాం. అతడు హర్యాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగతనాలు చేశాడు. అతనిపై ఇంతకుముందు 13 కేసులున్నాయి.” అని వల్సాడ్ పోలీస్ సూపరింటెండెంట్ కరన్ రాజ్ వాఘేలా చెప్పారు.

Related News

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Big Stories

×