ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అక్కడ నుంచి వాహనంలోకి తీసుకెళ్లారు. హైటెన్షన్ కారణంగా కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితర కీలక నేతలు హాజరకాలేదు. స్పెషల్ అధికారులు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల పంపిణీ కొనసాగుతోంది.
Palla Rajeshwar Reddy: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఎర్రగుంట తండాలో మంత్రుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్లాపై కోడిగుడ్లతో దాడి చేశారు. వెంటనే ఎమ్మెల్యేను పోలీసులు వాహనంలో తీసుకెళ్లారు.
వివరాల ప్రకారం.. ఇవాళ జనగామ జిల్లాలో ఎర్రగుంట తండాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన ఉంది. సంక్షేమ పథకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రావడంతో అక్కడ కొంచెం టెన్షన్ వాతావరణ నెలకొంది. కార్యక్రమానికి రాకుండా ముందస్తుగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే రిలీజ్ చేయాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఈ క్రమంలోనే అక్కడ జై కాంగ్రెస్, పల్లా గో బ్యాక్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేయడంతో.. వారికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా జై పల్లా అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం షురూ అయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై కోడిగడ్లతో దాడులు చేశారు. పరస్పరం కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను దూరం చేసి సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటి పరిస్థిితిలో మార్పు రాకపోయేసరికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
Also Read: Jagga Reddy on BJP: బీజేపీపై జగ్గారెడ్డి సెన్సెషనల్ కామెంట్.. అసలు ఆ పార్టీకి..?
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు అక్కడ నుంచి వాహనంలోకి తీసుకెళ్లారు. హైటెన్షన్ కారణంగా కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితర కీలక నేతలు హాజరకాలేదు. స్పెషల్ అధికారులు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల పంపిణీ కొనసాగుతోంది.