Bala Krishna : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణను స్వయంగా కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నందమూరి బాలకృష్ణను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఇంటికి వచ్చి కలిశారు. పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాల్లో ఎంతో విశేషమైన కృషి చేసిన బాలకృష్ణకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
“అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించిన బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇవ్వటం సంతోషం. దేశంలోనే ఉన్నతమైన అవార్డుల్లో ఒకటిగా నిలిచిన ఈ అవార్డు ఆయనకు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా బాలకృష్ణను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది చాలా సంతోషకరమైన అంశం. అందుకే స్వయంగా ఇంటికి వచ్చి కలిసి అభినందిస్తున్నా…” అంటూ కిషన్ రెడ్డి తెలిపారు.
ALSo READ : మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంచు వారసుడు.. రిపబ్లిక్ డే సందర్భంగా అలాంటి నిర్ణయం..