Jagga Reddy on BJP: బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారత జనతా పార్టీకి బలమే లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున బీజేపీికి ఎనిమిది సీట్లు వచ్చాయని సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. ఇందిరాగాంధీని విమర్శించడం బండి సంజయ్ వయస్సుకు తగదని.. వెంటనే ఆయన క్షమాపణ చెప్పి.. వివాదానికి స్వస్తి పలకాలని జగ్గారెడ్డి కోరారు.
బండి సంజయ్ ఊరుకే వెళ్దాం.. మాజీ ప్రధానమంత్రి ఇందిరమ్మ గురించి ఏ ముసలవ్వనైనా అడుగుదాం.. ఎలాంటి సమాధానం వస్తుందో చూద్దాం అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గర్భిణీగా ఉండి ఇందిరమ్మ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇందిరా గాంధీని చూసేందుకు మారుమూల గ్రామాల నుంచి తరలి వచ్చేవారని చెప్పారు. కేవలం ఉనికి కోసం మాత్రమే కేంద్ర మంత్రి బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ పేరు పెడితే సంజయ్ నిధులు ఇవ్వమని అనడం ఎంతవరకు కరెక్ట్ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నేతలు విలువలతో కూడిన రాజకీయం చేయాలని అన్నారు. బీజేపీలో ఒకప్పటి అగ్రనేతలైన అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్‌కే అద్వానీ గురించి తాము ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడింది లేదని అన్నారు. ఇందిరమ్మ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని.. దేశం కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందపరిచే బాధ్యత బీఆర్ అంబేద్కర్‌కు అప్పగించింది నెహ్రూయే అని పేర్కొన్నారు. ఇందిరమ్మను విమర్శించే స్థాయి బండి సంజయ్ కు లేదని.. అది ఆయన వయస్సుకు తగదని అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Srikakulam News: సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి
అలాగే, ఇందిరమ్మ ఇళ్లపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు ప్రభుత్వం ఇళ్లు అంటేనే ఇందిరమ్మ ఇళ్లు గుర్తుకు వస్తుందని చెప్పారు. ఆ రోజులు ఇంటి స్థలం కూడా ఇందిరా గాంధే ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు జనాల్లో గుండెల్లో నాటుకుపోయిందని అన్నారు. రాజకీయ పార్టీలు వారి ఉనికి కాపాడుకునేందకు విమర్శలు చేయడం కామన్ పోయిందని.. వాటిని కాంగ్రెస్ నేతలు పట్టించుకోమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.