BigTV English

The RajaSaab: తాతగా ఆ స్టార్ హీరో అన్నారు కదరా.. మరి ఇదెక్కడి ట్విస్టు.. ?

The RajaSaab: తాతగా ఆ స్టార్ హీరో అన్నారు కదరా.. మరి ఇదెక్కడి ట్విస్టు.. ?

The RajaSaab:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్  చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. ఇక ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. గతేడాది చివర్లో సలార్ తో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన డార్లింగ్.. ఈ ఏడాది కల్కితో  వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు.  ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ చేతిలో ఇంకో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ది రాజా సాబ్.


మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిసస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి డార్లింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలిపారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ .. తాత లుక్ లో కనిపించాడు. గంభీరం, రాయల్టీ, పవర్.. ఇలా అన్నింటిని ఒక్క ఫోటోలో చూపించారు.

Actor Darshan : కన్నడ హీరో దర్శన్ కు సర్జరీ..?


డార్లింగ్ ను ఇప్పటివరకు ఇలాంటి లుక్ లో ఫ్యాన్స్ చూసింది లేదు. దీంతో ట్రోలింగ్ కూడా నడుస్తుంది. చంద్రముఖి, నాగవల్లి సినిమాల్లో రాజులా ఉన్నాడని,  ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ఇలాంటి లుక్ లో ప్రభాస్ ను చూడాల్సి వచ్చిందేంటి అని కామెంట్స్ పెడుతున్నారు. మొదటి నుంచి కూడా రాజా సాబ్ కథ తాతమనవళ్ల మధ్య నడుస్తుందని చెప్పుకొస్తున్నారు. అయితే మధ్యలో తాత పాత్ర కోసం చాలామంది స్టార్ హీరోలను అనుకున్నారని వార్తలు వచ్చాయి.

అత్తారింటికి దారేది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాత బొమన్ ఇరానీ అని మొదట చెప్పుకొచ్చారు. ఆ తరువాత  బాలీవుడ్ స్టార్  హీరో సంజయ్ దత్.. తాత పాత్రలో నటిస్తున్నాడని  కొన్ని రోజులు వార్తలు వచ్చాయి. దీని తరువాత కట్టప్ప సత్యరాజ్ అని ఇంకొన్ని రోజులు మాట్లాడారు. ఇక ఇప్పుడు ఇవేమి కాదు.. తాతగా కూడా  ప్రభాస్ నే చేస్తున్నట్లు ఈ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. ఆదిపురుష్ లో రాముడు తండ్రి పాత్రలో చేస్తేనే ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. జీసెస్ లా ఉన్నాడని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.

Sri Murali: ప్రశాంత్ నీల్ మొదటి హీరో.. నెల్లూరు అల్లుడని తెలుసా.. ?

ఇక ఇప్పుడు  ఏకంగా డార్లింగ్ తో తాత గెటప్ వేయించాడు మారుతి.   అది కూడా మరీ ట్రోల్  అయ్యే విధంగా ఉండడంతో  డైరెక్టర్  ను ఫ్యాన్స్  ఏకిపారేస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం సినిమా చూడకుండా  ట్రోల్స్ చేయడం మంచిది కాదేమో.. సినిమా చూసాక కథను బట్టి బాగోకపోతే అప్పుడు చేసినా అందంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  మరి ఈ సినిమాతో  ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×