E-Paper
Advertisement

Swedha Patram: బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల వాయిదా..

Swedha Patram: బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల వాయిదా..
Advertisement

Swedha Patram: అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై తమ వాదన వినిపించేందుకు స్వేదపత్రంతో సిద్ధమైన బీఆర్‌ఎస్‌.. తన ప్రెజెంటేషన్ ను వాయిదా వేసుకుంది. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంది గులాబీ పార్టీ. అయితే అనువర్య కారణాలతో ఈ ప్రెజెంటేషన్ ను రేపటికి వాయిదా వేసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానాన్ని.. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రేపు వివరించనుంది బీఆర్ఎస్.

ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ రాశారు హరీష్‌రావు. అయితే అధికార కాంగ్రెస్‌ పక్షం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌కు ఆ అవకాశం దక్కలేదు. శ్వేతపత్రాల పేరుతో ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తమపై బురద జల్లేందుకే ప్రయత్నించిందని విమర్శిస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. తాము వివరణలు కోరినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదని.. అందుకే తెలంగాణ భవన్‌ వేదికగా స్వేద పత్రం పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతోంది బీఆర్‌ఎస్‌.

Advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గత ఉమ్మడి రాష్ట్ర సమావేశాలను తలపించాయి. చాన్నాళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు పదేళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగాయి. ఆరు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇటు ప్రభుత్వం.. అటు ప్రతిపక్షం తగ్గేదేలేదంటూ మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై ఒకరు విమర్శలతో అసెంబ్లీ వేదికగా హీట్‌ పుట్టించాయి.

.

Advertisement

.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×