BigTV English

AP Elections : టీడీపీ ఎన్నికల హామీ.. ముందే అమలుకు జగన్ సర్కార్ యోచన..

AP Elections : టీడీపీ ఎన్నికల హామీ.. ముందే అమలుకు జగన్ సర్కార్ యోచన..

AP Elections : ఏపీలో ఎన్నికల హడావిడి మొదలయ్యంది. అధికారం కోసం అన్ని పార్టీల అధినేతలు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం కల్పించి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.


టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. డిసెంబార్ 20 న విజయనగరంలో జరిగిన ‘యువగళం-నవశకం’ సభలో చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంశంపై హామీ ఇచ్చారు.

దాంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ హామీని ముందగానే అమలు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకోసం సీఎం జగన్ అధికారులతో.. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆర్టీసీ రాబడి ఎంత తగ్గుతుంది? ప్రభుత్వం ఎంత చెల్లించాల్సి వస్తుంది.. పొరుగు రాష్ట్రాలు ఏ నిబంధనలతో అమలు చేశాయి.. అన్న అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు.


సంక్రాంతి పండుగ నుంచే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం, విజయవాడలోని సిటీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.

ఏపీలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 లక్షల మంది మహిళలు ప్రయణం చేస్తున్నారు.10 లక్షల వరకు బస్ పాస్ లు కలిగినవారు ఉన్నారు. 3 నుంచి 4 లక్షల వరకు విద్యార్థినులు ప్రయాణిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి రోజుకు సగటున రూ. 17 కోట్ల ఆదాయం వస్తోంది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×