Fire Accident: దైవదర్శనానికి వెళుతున్నారు ఆ యువకులు. ఫ్లైఓవర్ వద్దకు కారు వచ్చేసింది. అంతలోనే ఒక్కసారిగా మంటలు. ఆ యువకులను, భగవంతుడే రక్షించినట్లుగా ఒక్కసారిగా అప్రమత్తమై కారులో నుండి దిగారు. తమను ఆ దేవుడే రక్షించాడని ఆ యువకులు తెలిపారు. ఈ ఘటన ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై మంగళవారం జరిగింది.
ఎండాకాలం ఇంకా రానే లేదు. అప్పుడే కార్లలో మంటలు వస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ ప్రభావమో, లేక ఇతర కారణమో కానీ ఇటీవల బైక్స్, కార్లకు మంటలు హఠాత్తుగా వ్యాపిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దశలో కార్లలో ప్రయాణించాలన్న వాహనదారులు కాస్తంత జంకుతున్న పరిస్థితి. అయితే కార్ల షోరూం మెకానిక్స్ మాత్రం.. ఏదైనా రిపేరీలు వచ్చిన సమయంలో వెంటనే మరమ్మతులు చేయించుకోవాలని, లేనియెడల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
చాలా వరకు కార్లకు అకస్మాత్తుగా మంటలు వ్యాపించిన సమయంలో పలుమార్లు వాహనదారులు కూడ ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. పలు ఘటనల్లో అదృష్టవశాత్తు వాహనంలోని వారు సురక్షితులయ్యారు. అలాంటి ఘటనే మంగళవారం జరిగింది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు. అలా బయలుదేరి ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్ వద్దకు కారు వచ్చింది. ఇక అంతే కారులో నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు గమనించిన యువకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Also Read: కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏం జరిగిందంటే..
వెంటనే కారులో నుండి దిగి నలుగురు యువకులు పరుగులు పెట్టారు. స్థానికులు, అటువైపుగా వెళ్తున్న వాహనదారులు కారులో నుండి మంటలు రావడాన్ని గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు తాము మంటలను గమనించి దిగినట్లు, లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని యువకులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. మొత్తం మీద ఎండాకాలం రాకమునుపే కార్లలో మంటలు వస్తున్నాయని, జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు వాహనదారులు.
షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ ఫ్లైఓవర్ పై షార్ట్ సర్క్యూట్ తో కారులో చెలరేగిన మంటలు
మంటల దాటికి పూర్తిగా దగ్ధం అయిన కారు
కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనం కోసం కారులో వెళ్తున్న నలుగురు యువకులు సేఫ్ pic.twitter.com/8vNQ18gdzb
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025