Big Stories

DELHI LIQUOR SCAM: అభిషేక్ బోయినపల్లికి బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ

DELHI LIQUOR SCAM : దిల్లీ మద్యం స్కామ్ కేసులో అరెస్టయిన బోయినపల్లి అభిషేక్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయాలని సీబీఐ కోరింది.నిందితుడికి పలుకుబడి ఎక్కువగా ఉందని బయటికి వస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సీబీఐ అధికారులు. అయితే సమీర్ మహేంద్రుతో ఎలాంటి నగదు లావాదేవీలు లేవని అభిషేక్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు తర్వాత తదుపరి విచారణను రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయవాది ఈ నెల 9కి వాయిదా వేశారు.

- Advertisement -

లిక్కర్ స్కామ్ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిన వ్యవహారంలో అభిషేక్ కీలకంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు తేల్చారు. ఈ వ్యవహరంలో వ్యాపార,రాజకీయ ప్రముఖుల వివరాలను ఆరా తీశారు. అభిషేక్ కస్టడీకి తీసుకుని విచారించినా సరైన సమాధానాలు చెప్పలేదని సీబీఐ అధికారుల వాదన. నిందితుడికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, నగదు బదిలీపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్‌ గా బోయినపల్లి అభిషేక్‌ ఉన్నారు. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అభిషేక్‌ అరెస్ట్‌ వ్యవహారం తర్వాత తెలంగాణలో ఈ కేసు ప్రకంపనలు సృష్టించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News