Chaddi Gang Scare: చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ సిటీలోకి చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ గ్యాంగ్ విషయం తెలియగానే అపార్ట్‌మెంట్‌వాసులు వణికిపోతున్నారు. మణికొండ నెక్నాంపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లోకి ఆరుగురు వ్యక్తులు ఎంట్రీ ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అలర్టయిన పోలీసులు, ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తులో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్ నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ విషయం తెలియగానే అపార్టుమెంటు, సామాన్యులు హడలిపోతున్నారు. మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్ వెనుక వైపు నుంచి ఫెన్సింగ్‌ను కత్తిరించారు. ఆ తర్వాత ఆరుగురు దుండగులు లోపలికి చొరబడ్డారు. తొలుత ముగ్గురు దుండగులు అపార్టుమెంట్ అంతా తిరిగాయి. ఒకరు లిఫ్ట్ వద్ద ఉండగా, మరో ఇద్దరు మెట్లు ఎక్కి వివిధ ఫ్లోర్లలోకి వెళ్లారు.
అయితే సీ బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించినట్లు సమాచారం. చోరీ జరుగుతున్న సమయంలో అనుమానాస్పదం గా సంచరిస్తున్న దుండగులను అపార్ట్‌మెంట్‌లోని ఓ వ్యక్తి గమనించి ప్రశ్నించినట్టు సమాచారం. వారంతా ఆ వ్యక్తితో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాదు వెంట తెచ్చుకున్న ఆయుధాలతో దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అపార్ట్‌మెంట్‌వాసులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి తెలియగానే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అపార్ట్‌మెంట్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలను ట్రాక్ చేసినట్టు సమాచారం. చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీతో నెక్నాంపూర్, అల్కాపూర్ టౌన్‌షిప్ పరిసర ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు.
చెడ్డీ గ్యాంగ్స్ ఆగడాల గురించి చెప్పనక్కర్లేదు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో సంచరించే నేరగాళ్ల సమూహం. ఈ గ్యాంగ్ సభ్యులు కేవలం లోదుస్తులు అంటే కుర్తా -లుంగీ ధరించి దాడులు చేస్తుంది. ఒంటి నిండా ఆయిల్ రాసుకుంటారు. ఎవరైన పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారి చేతుల నుంచి జారీ పోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. లోదుస్తులు ధరించడంతోపాటు తమ గుర్తింపును కాపాడుకోవడానికి ముఖానికి మాస్క్‌లు ధరిస్తారు. లేకుంటే నల్లటి మసి పూసుకుంటారు. ఈ ముఠాలు సాధారణంగా 5 నుంచి 10 మంది గ్రూపుగా తిరుగుతుంటాయి.
ALSO READ: ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!
పగటి వేళ రవాణా కేంద్రాల వద్ద, రద్దీ ప్రాంతాలలో గుమిగూడుతారు. దోచుకోవడానికి అనువైన ఇళ్లను గుర్తించి బిచ్చగాళ్లు, సాధారణ కూలీలుగా కనిపిస్తుంటారు. ఈ ముఠా సభ్యులు తరచు తిరగడానికి కార్లను అద్దెకు తీసుకుంటారు. చెడ్డీ గ్యాంగ్ కార్యకలాపాలు 1987 నుండి జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్ , ఉత్తర ప్రదేశ్ , మధ్యప్రదేశ్ , హర్యానా , ఢిల్లీ , రాజస్థాన్ , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చురుకుగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి ఆనవాళ్లు పెద్దగా లేవు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సామాన్యులు హడలిపోతున్నారు.
Cheddi Gang strikes Flotilla Apartments in Neknampur
Before dawn, a security breach alarmed residents of Neknampur's Ward 128. Around 3:20 AM, about six suspected members of a Cheddi Gang allegedly cut the fence on the lake side of Flotilla Apartments. They entered the complex… pic.twitter.com/g8e8YhAuCl
— Hyderabad Mail (@Hyderabad_Mail) September 27, 2026