E-Paper
Advertisement

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!
Advertisement

TGSRTC Union: స్వేచ్చ బ్యూరో: ఆర్‌టిసి యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌ తన స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి యూనియన్) ను పక్కనపెట్టి ఇప్పటికిప్పుడు టి డబ్ల్యూ యు తన అధికార సంఘంగా పేరు పెట్టి మంత్రులే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ను ఓడించడానికి ప్రయత్నాలు చేయడం అధర్మమని, కార్మికుల పక్షాన నిలిచే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ విజయం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. ఆర్‌టిసి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను రాజకీయ రణరంగంగా మార్చకుండా స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్నలతో కలిసి ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో పోటీ..

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు మద్దతు ఉన్న ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ను ఓడించేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ తనది కాని యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఏ యూనియన్‌ అయినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, తన సొంత సంఘాన్ని పక్కన పెట్టి ఆర్టీసీ పరిరక్షణకు పాటుపడిన ఏఐటీయూసీ సంఘాన్ని ఓడించాలనుకోవడం ఆత్మహత్య సదృశ్యం అని అన్నారు. టిడబ్ల్యూయు సంబంధించిన నాయకులు అటు బిజెపి టిఆర్ఎస్ ఉన్న వాళ్ళని ఇప్పటికిప్పుడు హక్కున చేర్చుకున కాంగ్రెస్ నమ్ముకున్న యూనియన్ ని పక్కన పెట్టడం అనేది వారి ఇష్టమే, కానీ దాని వెనుక రాజకీయంగా కుట్ర ఉండకూడదు. కమ్యూనిస్టు యూనియన్ ఉండకూడద చెప్పడం అన్యాయం అన్నారు. ఆర్‌టిసి పుట్టుక నుంచి కార్మిక ఉద్యమంతో ఎఐటియూసికి పేగుబంధం ఉందని, ఈ ఎన్నికల్లో కార్మికులు ఎంప్లాయిస్‌ యూనియన్‌కే పట్టం కడుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కమ్యూనిస్టు మద్దతు ఉన్న యూనియన్‌ గెలవకూడదా?

Advertisement

ఆర్‌టిసి గుర్తింపు సంఘం ఎన్నికలలో కమ్యూనిస్టు మద్దతు ఉన్న యూనియన్‌ గెలవకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ వ్యవహరించడం సరికాదన్నారు.కాంగ్రెస్‌ పార్టీ కోసం ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు, ఆర్‌టిసి కార్మికులు గతంలో ప్రచారం చేశారని, ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి మద్దతు కోరారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే కార్మిక సంఘాల విషయంలో కాంగ్రెస్‌ రాజకీయ జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. అధికార పార్టీ వారి సంఘం తరఫున పోటీ చేయాలని, తాము తమ సంఘం తరఫున మేం పోటీ చేస్తామని గెలుపోటములను కార్మికులే నిర్ణయిస్తారన్నారు. ఎవరి సంఘాన్ని వారు బలోపేతం చేసుకోవాలి కానీ ఒక సంఘాన్ని ఓడించేందుకు మరో సంఘానికి రాజకీయంగా మద్దతు ఇవ్వడం సరికాదు అని అన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల సమయంలోనూ రాజకీయ జోక్యం పెరిగిందని, ఆర్‌టిసి ఎన్నికలను కూడా అదే తరహాలో రాజకీయ పోరాటంగా మార్చవద్దని సూచించారు.

Also read: మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

కాంగ్రెస్‌కు టిడబ్ల్యూయూకు మద్దతా?

Advertisement

తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌కు కాంగ్రెస్‌ నాయకత్వం మద్దతు ఇవ్వడం ఆ సంఘానికి కాంగ్రెస్‌ అనుబంధం కల్పిస్తున్నట్లు ప్రకటించడం ఆధర్మమన్నారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘం ఐఎన్‌టియూసిని పక్కన పెట్టి మరో సంఘానికి మద్దతు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటో కాంగ్రెస్‌ నాయకత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బిజెపి ఓటు చోరీకి పాల్పడితే కాంగ్రెస్‌ యూనియన్‌ చోరీకి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.టియుబ్ల్యూకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆ యూనియన్‌ గెలిస్తే ప్రభుత్వంలో ఆర్‌టిసిని విలీనం చేయకుండ ఉండడంలో భాగంగానే ఈ మద్దతు ఇస్తుందనే అనుమానం ఉందని ,దీనిని ఆర్‌టిసి కార్మికులందరు గమనించాలని కోరారు. అధికార పార్టీ ఎంత హంగామా చేసినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా కార్మికులకు వాస్తవాలు తెలుసన్నారు.

ఎఐటియూసి పోరాటాల వల్లే ఎన్నికలు

ఆర్‌టిసిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే పరిస్థితి రావడానికి ఎఐటియూసి, ఇతర కార్మిక సంఘాల పోరాటాలే కారణమని కూనంనేని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.గతంలో జరిగిన సమ్మెల్లో ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసిన కార్మికుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు. ఈ ఎన్నికల్లో ‘చివరకు ఎర్రజెండానే గెలుస్తుంది’ఆర్‌టిసి కార్మికుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని కూనంనేని స్పష్టం చేశారు.

ఎస్‌.బాబు, ఈదుర వెంకన్నలు మాట్లాడుతూ..

ఆర్‌టిసి గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధర్మానికి పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో ఒక యూనియన్‌కు కేటాయించిన గుర్తును మరో యూనియన్‌కు కేటాయించడం చట్టవిరుద్దమన్నారు. ఈ అంశాన్ని నిరసిస్తూ సోమవారం లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు భారీ నిరసనను వ్యక్తం చేయనున్నుట్లు ప్రకటించారు.

Also read: హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

Tags

Related News

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×