E-Paper
Advertisement

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా

కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా
Advertisement

Tamil Family Thriller OTT : భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నా, ఒక నిజాన్ని దాచి పెట్టడం ఆ బంధాన్ని ఎప్పటికైనా దెబ్బ తీయవచ్చు. ముఖ్యంగా గతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన విషయం ఏళ్ల తర్వాత బయట పడితే, అప్పటి వరకు నమ్మకంగా కనిపించిన జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఓ డాక్టర్, సామాజిక కార్యకర్తగా పని చేసే అతడి భార్య మధ్య దూరానికి ఏడేళ్ల కిందటి రహస్యం కారణమైతే ? ఆ నిజాన్ని తెలుసుకోవాలని వారి కూతురు ప్రయత్నిస్తే ? కుటుంబ బంధాలు, నేరం, గతంలో దాచిన నిజాల చుట్టూ సాగే తమిళ చిత్రం ‘పారిస్ కేఫ్’ (Paris Cafe). మరి ఈ ఫ్యామిలీ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

గౌతమ్ ఓ డాక్టర్. తారా సామాజిక కార్యకర్త. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఓలి విళియాళ్ అనే కూతురు ఉంటుంది. కుటుంబంగా ప్రశాంతంగా జీవించాల్సిన వీరి జీవితంలో గతానికి సంబంధించిన ఓ సంఘటన పెద్ద సమస్యగా మారుతుంది. వైద్యుడిగా పని చేస్తున్న సమయంలో గౌతమ్ కొన్ని పరిస్థితుల కారణంగా గౌరవ్ హత్యకు సంబంధించిన నిజాన్ని దాచి పెడతాడు. అందుకోసం తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తాడు. అప్పట్లో ఆ నిర్ణయం ఓ సమస్యను కప్పిపుచ్చినట్లు కనిపించినా, దాని ప్రభావం తర్వాతి జీవితంలో తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.

Advertisement

తారా సామాజిక కార్యకర్త కావడంతో అన్యాయానికి గురైన వారికి న్యాయం జరగాలనే ఆలోచనకు ప్రాధాన్యం ఇస్తుంది. కానీ గౌతమ్ తీసుకున్న నిర్ణయం వారి మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. గతంలో జరిగిన విషయాలను దాచిపెట్టడం, నిజాన్ని బయటపెట్టాలా వద్దా అనే సంఘర్షణ వారి సంబంధాన్ని సంక్షోభంలోకి నెడుతుంది. చివరకు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రుల మధ్య దూరాన్ని చూసిన కూతురు ఓలి కూడా ఈ సమస్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది.

ఏడేళ్ల కిందటి సంఘటనకు సంబంధించిన నిజాలు బయట పడుతున్న కొద్దీ, అది కేవలం ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదని అర్థమవుతుంది. అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాలంటే గతంలో దాచిన విషయాలను బయట పెట్టాల్సి వస్తుంది. అయితే నిజం బయటపడితే తమ జీవితాలు మరింత కష్టంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. గౌతమ్ తన తప్పును అంగీకరించగలడా ? తారా అతడిని మళ్లీ నమ్మగలదా ? తల్లిదండ్రుల మధ్య విభేదాలకు కారణమైన నిజాన్ని తెలుసుకున్న ఓలి ఏ నిర్ణయం తీసుకుంటుంది ? గతంలో జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా ఈ కుటుంబం కలిసి నిలబడగలదా ? అనేవి కథలో ఉత్కంఠను పెంచే అంశాలు.

Advertisement

Also Read : బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

సరాజ్ సీలన్ (Saraj Seelan) దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రంలో గురు సోమసుందరం (Guru Somasundaram), అనుమోల్ (Anumol), విజయ్ విశ్వ (Vijay Vishwa), నయనా సాయి (Nayana Sai) తదితరులు నటించారు. ‘పారిస్ కేఫ్’ (Paris Cafe) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా తమిళ్ (Aha Tamil) వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. అలాగే సింప్లీసౌత్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

చేత్తో తాకకుండానే కార్లు, వస్తువులు గాల్లోకి… ఒక్క గుక్క నీళ్లకు ఇంత పవరా ? ఇంట్రెస్టింగ్ కొరియన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్

ప్రేమ ఒకరితో… పెళ్లి మరొకరితోనా ? నవ్వులు పూయించే పంజాబీ రొమాంటిక్ కామెడీ

అమాయకపు కుర్రాడు అనుకున్నారు… కట్ చేస్తే ప్రపంచంలోనే పవర్‌ఫుల్ మాంత్రికుడు… ఓటీటీలోకి సీజన్ 2

ఓటీటీలోకి రెండు మైండ్ బ్లోయింగ్ హర్రర్ యానిమే సిరీసులు… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

సంగీతంతో ఒక్కటయ్యే బంధాలు… మనసును తాకే భావోద్వేగాలతో తెలుగు ఫ్యామిలీ డ్రామా

బందిపోటుగా మారే స్వాతంత్ర్య సమరయోధుడు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ బయోపిక్

వద్దనుకున్న లవర్ సడన్‌గా లైఫ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తే… ఆ కిక్కే వేరప్పా… ఓటీటీలోకి ఎమోషనల్ మూవీ

Big Stories

Advertisement
×