Kamran Akmal On IND VS PAK : ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కౌంట్ డౌన్ షురూ అయింది. అక్టోబర్ మూడు అంటే శనివారం రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ పై ఉదయం నుంచి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జట్టును ఓడించే దమ్ము పాకిస్తాన్ దగ్గర లేదని… అందుకే ఫైనల్స్ వర్షం కారణంగా రద్దు అయ్యేలా ప్రార్థనలు చేయాలని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు వర్షం పడి మ్యాచ్ రద్దు అయ్యేలా మసీదులకు వెళ్లి అల్లాకు ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. అలా జరిగితే టీమిండియా చేతిలో ఓటమి బాధ నుంచి బయటపడడమే కాకుండా గోల్డ్ మెడల్ ఇరు జట్లకు వస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పరువు కూడా కాపాడుకోవచ్చని కీలక సూచనలు చేశారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో భాగంగా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం గ్యారంటీ అంటూ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారని.. వాళ్ల ప్రదర్శన చూస్తుంటే పాకిస్తాన్ జట్టును సులభంగా ఓడిస్తారని తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కంటే శ్రేయస్ అయ్యర్ సేన చాలా బలంగా ఉందని తెలిపారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ జట్టును కాపాడడానికి అందరూ అల్లాను ప్రార్థించాలని పిలుపునిచ్చారు.
ఫైనల్స్ సందర్భంగా వర్షం పడాలని అల్లాను ప్రార్థించాలని.. మసీదులకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలంటూ కమ్రాన్ అక్మల్ హాట్ కామెంట్స్ చేశారు. భారత జట్టు చేతిలో ఓడిపోవడం తనకు అసలు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. కానీ మ్యాచ్ జరిగితే భారత క్రికెటర్లు పాకిస్తాన్ జట్టును ఊచకోత కోస్తారని హెచ్చరించారు. ఇలాంటి నేపథ్యంలో వర్షం పడితే రెండు జట్లు గోల్డ్ మెడల్ సాధించవచ్చు అని స్పష్టం చేశారు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు డుమారం రేపుతున్నాయి.’
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ సందర్భంగా వర్షం పడితే 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించే ఛాన్సులు ఉంటాయి. అది కూడా కుదరకపోతే మ్యాచ్ రద్దు చేస్తారు. ఈ క్రమంలో గోల్డ్ మెడల్ ను టీమిండియా, పాకిస్తాన్ జట్లు పంచుకోవాలి.