BigTV English

CM Revanth Reddy: రోజా ఇంటికి వెళ్లి కోడిపులుసు, రాగి సంగటి తినలేదా కేసీఆర్: సీఎం రేవంత్

CM Revanth Reddy: రోజా ఇంటికి వెళ్లి కోడిపులుసు, రాగి సంగటి తినలేదా కేసీఆర్: సీఎం రేవంత్

CM Revanth Reddy: రైతుభరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 70 లక్షల కుటుంబాలకు రైతు భరోసా పథకం ఇచ్చామని చెప్పారు. 9 రోజుల్లోనే రైతు భరోసా నగదు రైతుల ఖాతాల్లో జమచేశామని సీఎం అన్నారు. రైతుభరోసా విజయోత్సవ సభను తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.


‘భూమి చుట్టూనే తెలంగాణలో పోరాటాలు జరిగాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి.. వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకొచ్చాం. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్. మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతులే.. కేసీఆర్ ఎగవేసిన రైతు భరోసా నిధులను మేం ఇచ్చాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశాం. అధికారంలోకి వచ్చిన మొదట ఏడాదిలోనే.. రూ.20,600 కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని కేసీఆర్ అన్నారు. సన్నవడ్లకు బోన్ కూడా ఇస్తామని చెప్పాం.. ఇచ్చాం. శకుని మామ, శనీశ్వరుడైన అల్లుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. రైతుబందు ఇచ్చేందుకు నాడు భూములు అమ్మారు. రుణ మాఫీ కోసం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేశారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏంటి..? ఇప్పుడు వారికి ఫామ్ హౌజ్‌లు, ఆస్తులు ఎలా వచ్చాయి..?’ అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.

ALSO READ: Revanth Reddy: బీ రెడీ.. జమిలిపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


‘గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటాలు జరిగేవి. ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలని పోరాటాలు చేస్తున్నారు. 18 నెలల్లో రైతుల కోసం లక్షా 4వేల కోట్లు ఖర్చు చేశాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే.. కార్యచరణతో మేం ముందుకు సాగుతున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. 18 నెలల పాలనను బేరీజు వేయండి. కేసీఆర్ కుట్రలో తెలంగాణ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ప్రాజెక్టుల పేరు, ఊరు మార్చి లక్ష కోట్లు కొల్లగట్టారు. నాడు సీమాంధ్ర పాలకు తెలంగాణను ఎడారిగా మార్చారని.. చెప్పిన కేసీఆర్ వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారు. మిమ్మిల్ని ఉరి తీసినా తప్పు లేదని రైతాంగం అంటోంది. చంద్రబాబుతో ఉండాలనుకుంటే టీడీపీలోనే ఉండేవాడిని.. తెలంగాణ కోసమే రాజీవ్ ఆశీస్సులతో కాంగ్రెస్ లోకి వచ్చాం.. గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడతాం.. కేసీఆర్ చర్చకు సిద్దమా..?’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

గతంలో కేసీఆర్ కాంచీపురం వెళ్లి వచ్చేటప్పుడు నగరిలోని రోజా ఇంటికి వెళ్లిన సంఘటనను గుర్తుచేశారు. ఆమె పెట్టిన నాటు కోడి పులుసు, రాగి సంగటి తిని రాయలసీమను రతనాల సీమను చేస్తానని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు ముచ్చుమర్రి కట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు జీవోలు ఇచ్చింది కేసీఆర్ హయాంలోనే.. చేసిన తప్పులకు ముఖం చెల్లక ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదు. హరీష్ రావుతో మాట్లాడించడం కాదు.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఒక రోజు గోదావరిపై చర్చిద్దాం. ఇంకో రోజు కృష్ణా జలాలపై చర్చ చేపడుదాం. చంద్రబాబుకు వంగి సలామ్ చేసి సంతకం చేసొచ్చింది కేసీఆర్ కాదా..? తెలంగాణకు శాశ్వతంగా మరణశాసనం రాసింది కేసీఆరే. చచ్చిపోయిన బీఆర్ఎస్‌ను బతికించేది గోదావరి అని కేసీఆర్ భావిస్తున్నారు. గోదావరి సెంటిమెంట్ తో పార్టీని మళ్లీ బతికించుకోవాలని చూస్తున్నారు. బనకచర్ల ప్రతిపాదన దశలోనే వ్యతిరేకించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related News

Hyderabad News: ఓ వైపు మిలాద్.. గణేష్ నిమజ్జనం, భద్రతపై కమిషనర్ సమీక్ష

Kavitha: కవిత పదవికి రాజీనామా? మీడియా సమావేశంలో ఏం చెబుతారు, బీఆర్ఎస్‌లో చర్చ

CM Revanth Reddy: షర్మిల గారు.. వచ్చి నా కుర్చీలో కూర్చోండమ్మా: సీఎం రేవంత్

BRS Reactions: కవితపై ఇంత కక్ష ఉందా? ఒక్కొక్కరే బయటకొస్తున్న బీఆర్ఎస్ నేతలు

Weather News: రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అయితే కుండపోత వానలు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కొత్త కాన్సెప్ట్.. తక్కువ ధరకే తాగునీరు! ఎంతో తెలుసా?

Big Stories

×