E-Paper
Advertisement

రావణాసురుడితోనే రాముడికి పేరు.. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

రావణాసురుడితోనే రాముడికి పేరు.. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉనికిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక చిట్ చాట్లో సీఎం మాట్లాడారు. కేసీఆర్ ప్రస్తుతం ఫీల్డ్ లోనే లేరని, ఆయన గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదన్నారు. అయితే కేసీఆర్ ఉండటం వల్లే తనకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రావణాసురుడు ఉండటం వల్లే రాముడికి ఏ విధంగా గుర్తింపు వచ్చిందో, కేసీఆర్ ఉండటం వల్లే రేవంత్ రెడ్డికి అంతటి పేరు వచ్చిందని సీఎం పేర్కొన్నారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలోని వైఫల్యాలే తనను ప్రజల్లోకి తీసుకెళ్లాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ గృహ నిర్బంధంలో ఉన్నారేమోనని తనకు అనుమానంగా ఉందన్నారు. ఆయన బావ బామ్మర్దులే (హరీష్ రావు, కేటీఆర్) ఆయనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని గుర్తు చేశారు సీఎం. కానీ తమ ప్రభుత్వం సన్న బియ్యం సాగుకు బోనస్ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణలో బాగా పనిచేస్తున్న దక్షిణాదిని శిక్షించేలా ఈ నిర్ణయం ఉండకూడదని హెచ్చరించారు. ఇది పార్టీల సమస్య కాదు.. దక్షిణాది ప్రజల మనుగడ సమస్యగా అభివర్ణించారు. 50 శాతం సీట్లు పెంచితే దాని వల్ల ఉత్తర భారతదేశానికే నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాలకు సౌత్ ఇండియా అవసరం లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనిపై వితండవాదం చేస్తున్నారని, దక్షిణాది ప్రయోజనాల కోసం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సీఎం స్పష్టతనిచ్చారు. 14,560 కోట్లు ఖర్చు చేసి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, ఇందులో ఎటువంటి కోతలు ఉండవని స్ప‌ష్టం చేశారు. సన్న బియ్యం పక్కదారి పట్టకుండా హైడ్రా, పీడీ యాక్ట్ తరహాలో కల్తీ నివారణకు కఠిన విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకంలో ఎటువంటి మార్పులు లేవని, అర్హులైన పేదలందరికీ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం సెస్ పేరుతో వసూలు చేస్తున్న నిధుల్లో రాష్ట్రాలకు కేవలం 34 శాతం మాత్రమే ఇస్తోందని, మిగిలిన నిధులను బీజేపీకి నచ్చిన రాష్ట్రాలకే మళ్లిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తిరుగులేని మెజార్టీ వస్తే నియంతృత్వం వస్తుందని, దేశంలో బ్రూటల్ మెజార్టీ కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనించాలని కోరారు. పరిపాలనపైనే తమ పూర్తి దృష్టి ఉందన్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు సీఎం వెల్లడించారు.

Read Also: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×