IT Rides on Tollywood : టాలీవుడ్ దర్శకనిర్మాతలపై ఇన్కమ్ టాక్స్ అధికారులు కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల నుంచి ఇన్కమ్ టాక్స్ అధికారులు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల ఇల్లు, ఆఫీసులపై సుదీర్ఘంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల సుకుమార్ ఇంట్లో జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ సోదాలు తాజాగా ముగిసినట్టు సమాచారం.
కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఇంట్లో నిన్నటి నుంచి ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రీసెంట్ గా సుకుమార్ ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీతో భారీ సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ మూవీ వసూళ్లకు తగ్గట్టుగా ఐటి చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యాంకు లావాదేవీలు కూడా పరిశీలిస్తున్న అధికారులు, ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. నిన్న ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి తీసుకువచ్చి మరీ ఇన్కమ్ టాక్స్ అధికారులు ఈ సోదాలు మొదలుపెట్టారు.
సుకుమార్ (Sukumar) ఇంట్లో నిన్న మధ్యాహ్నం మొదలు పెట్టిన ఐటీ రైడ్స్ ఈరోజుతో ముగిశాయని సమాచారం. రెండు రోజులపాటు సాగిన ఇన్కమ్ టాక్స్ తనిఖీలలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, సుకుమార్ ఇంట్లో సోదాలను ముగించారు. మరి డాక్యుమెంట్స్ లో ఏముంది? లెక్కల మాస్టర్ ‘పుష్ప 2’ మూవీ పన్నులకు సంబంధించి లెక్కలేమయినా తప్పారా ? వీటివల్ల నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏంటి? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పోస్టర్స్ వల్ల లేనిపోని చిక్కులు
ఇటీవల కాలంలో టాలీవుడ్ నిర్మాతలు తాము నిర్మిస్తున్న సినిమాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి అంటూ పోస్టుల ద్వారా మోత మోగిస్తున్నారు. ఆ మోత మొత్తానికి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్స్ చెవులకి వినిపించడంతో అసలు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సినిమాలకు బడ్జెట్ ఎంత పెడుతున్నారు? వాటికి వస్తున్న అసలైన కలెక్షన్స్ ఏంటి? కలెక్షన్లకు తగ్గట్టుగా టాక్స్ లు కరెక్ట్ గానే పే చేస్తున్నారా లేదా? అనే విషయాలను ఆరా తీయడానికి రంగంలోకి దిగినట్టు టాక్ నడుస్తోంది.
జనాలను అట్రాక్ట్ చేయడానికి ఫేక్ కలెక్షన్లతో పోస్టర్స్ వేసి, మొత్తానికి ఐటీ అధికారుల దృష్టిలో పడ్డారు నిర్మాతలు. ఫేక్ పోస్టర్లతో లేనిపోని చిక్కులని కొని తెచ్చుకుంటున్నారు టాలీవుడ్ నిర్మాతలు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మూడవ రోజు కూడా దిల్ రాజు (Dil Raju), శిరీష్, నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై రవిశంకర్ (Ravishankar), అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) వంటి బడా నిర్మాతల ఇల్లు, ఆఫీసులు వదలకుండా సోదాలు నిర్వహిస్తున్నారు ఇన్కమ్ టాక్స్ అధికారులు.