E-Paper
Advertisement

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో అయితే..

అల్పపీడనం ప్రభావం.. తెలంగాణల్లో భారీ వర్షాలు,  హైదరాబాద్‌లో అయితే..
Advertisement

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం ఓ మోస్తరుగా పడినా.. మంగళవారం మాత్రం జోరు పెంచింది. ఫలితంగా వేకువజామున వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ-తెలంగాణల్లోని వివిధ జిల్లాల్లో అదే పరిస్థితి నెలకొంది. 24 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

అల్పపీడనంతో తెలంగాణలో భారీ వర్షాలు

Advertisement

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణల్లోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. గంగానది పరివాహక ప్రాంతాన్ని ఆనుకున్న ఉన్న పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలపై అల్పపీడనం చురుకుగా కదులుతోంది. మంగళవారం నాటికి జార్ఖండ్, ఉత్తర ఒడిశా వాయువ్య దిశగా కదులుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

 

ఉత్తర, ఈశాన్య తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి

Advertisement

రాబోయే రెండు గంటల్లో నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా భారీ వర్షాలు పడే అవకాశముంది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. మిగతా జిల్లా్ల్లో వాతావరణ పొడిగా ఉండే అవకాశం ఉంది. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది.

 

తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ సిటీలో భారీ వర్షం

ఇక హైదరాబాద్ సిటీ విషయానికి వద్దాం. మంగళవారం నాలుగు గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే గంటలో శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, బాలానగర్, సికింద్రాబాద్, బేగంపేట, ముషీరాబాద్, అంబర్‌పేట, నాంపల్లి, హిమాయత్‌నగర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసింది.

భారీ వర్షం కారణంగా హైదరాబాద్ సిటీలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. నాళాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక డ్రైనేజీల సంగతి చెప్పనక్కర్లేదు.  పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. వర్షాల నేపథ్యంలో ఉదయం డ్యూటీలకు వెళ్లేవారు ముందుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచన చేశారు.

ALSO READ: హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

కోస్తాంధ్ర, యానాంపై నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నా, రాయలసీమపై బలహీనంగా కనిపిస్తున్నాయి. పొడి వాతావరణంతో సతమతమవుతున్న ఏపీకి వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని అక్కడక్కడా ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం పడే సమయంలో గంటలకు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

Related News

తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

Big Stories

Advertisement
×