BigTV English

CM Revanth Reddy Kerala Tour: కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ.. వయనాడ్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy Kerala Tour: కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ.. వయనాడ్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy Kerala Election Campaign(TS today news): కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన భారతదేశ తదుపరి ప్రధాని రాహుల్ గాంధీ అని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లు వారణాసి ఎంపీ ప్రధానిగా ఉన్నారని.. రాబోయే 20 ఏళ్లు వయనాడ్ ఎంపీయే దేశానికి ప్రధానిగా ఉంటారని భరోసా ఇచ్చారు.


ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై విమర్శల వర్షం గుప్పించారు. అవినీతికి ఛాంపియన్ ప్రధాని నరేంద్ర మోదీ అని ఆరోపించారు. ఈవీఎంలపై అటు ప్రజలకు.. ఇటు విపక్షాలకు నమ్మకం పోయిందని.. బ్యాలెట్ పేపర్లంటే ప్రధాని భయపడుతున్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తుంటే.. ఇండియాలో మాత్రం ఈవీఎంలు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.

CM Revanth Reddy Kerala Election Campaign
CM Revanth Reddy Kerala Election Campaign

ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు అడిగే కనీస హక్కు బీజేపీకి గానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గానీ లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దక్షిణాదికి ఏమిచ్చారని ఓటు వేయాలని ప్రశ్నించారు. అబ్ కీ బార్ 400 పార్ అనే స్లోగన్ వినడానికి బాగానే ఉన్నప్పటికీ.. అన్ని సీట్లు రాబోవని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పది సంవత్సరాలలో ప్రధాని మోదీ దేశాన్ని భ్రష్టు పట్టించారని రేవంత్ రెడ్డి విమర్శించారు.


సౌత్ ఇండియా అనేది ఇండియాలో అంతర్భాగమేనని.. ఇన్ని రోజులు గుర్తురాని సౌత్ ఇండియా మోదీకి ఇప్పుడెందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు. గుజరాత్‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని నిలదీశారు. దేశంలోని కీలక పదవులైన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, హోం, డిఫెన్స్ మినిస్ట్రీలను దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: దమ్ముంటే టచ్ చెయ్.. కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి మాస్ వార్నింగ్..

అసలు దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఎప్పుడో నిషేధించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వయనాడ్‌లో పోటీలో ఉన్న ఎల్డీఎఫ్ అభ్యర్థికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు అండగా నిలిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×