BigTV English
Advertisement

Mission Bhagiratha: మిషన్ భగీరథపై సీఎం రేవంత్ ఫోకస్.. నేడు ఉన్నతస్థాయి సమీక్ష

Mission Bhagiratha: మిషన్ భగీరథపై సీఎం రేవంత్ ఫోకస్.. నేడు ఉన్నతస్థాయి సమీక్ష

CM Revanth Focus on Mission Bhagiratha: మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమం లోనే నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ ప్రాజెక్టుపై మొదటిసారి సమీక్ష జరుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా వేసవి ఆరంభం కావడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు..పెండింగు బిల్లులు, తదితర అంశాలపై రేవంత్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే గ్రామాల్లో నీటి సరఫరా తీరు పై పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోంది. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరాశాఖ ఆధ్వర్యంలో ఉండగా.. ఇటీవల ప్రభుత్వం ఆ బాధ్యతను పంచాయతీలకు అప్పగించింది. ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులకు దీనిపై మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. మిషన్ భగీరథలో ఎవరెవరికి కాంట్రాక్టులు అప్పగించారన్న దానిపై కాంగ్రెస్ సర్కారు ఆరా తీస్తోంది.

Read More : వనమంతా జనమైన వేళ.. కనులవిందుగా మేడారం జాతర


2016 ఆగస్టులో మిషన్​ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. డీపీఆర్​ ప్రకారం 43 వేల 791 కోట్లు రూపాయలు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు అధికారికంగా 31 వేల కోట్ల రూపాయలు మేర ఖర్చు చేశారు. అయినా ఈ పథకానికి ఇంకా కొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. లక్షా 50 వేల కిలో మీటర్ల పైప్‌ లైన్ వేసి.. 2.72 కోట్ల మంది ప్రజలకు మిషన్​ భగీరథ కింద మంచినీటి సౌకర్యం అందించామని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కనెక్షన్లు ఇచ్చి కొన్ని చోట్ల నల్లాలు బిగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇంకా మిషన్​ భగీరథ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మిషన్​ భగీరథ పథకానికి తొలుత భారీ అంచనాలతో డీపీఆర్​ సిద్ధం చేశారు. తొలుత 45 వేల కోట్లు అంచనా వేయగా తరువాత దానిని సవరించి 43,791 కోట్లకు కుదించారు. ఖర్చు పెట్టింది మాత్రం 31 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ 77 శాతం అప్పులు ఉండగా, మిగిలిన 20 శాతమే గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులోనూ మూడు శాతం కేంద్రం గ్రాంట్ల రూపంలో నిధులు రాష్ట్రానికి వచ్చాయి. అయితే మిషన్ భగీరథకు ఖజానా నుంచి ఖర్చు చేసిన మొత్తం 6 వేల 122 కోట్లు రూపాయలుగా ఉంది. దీంతో అప్పులు, నిధులు ఏయే కాంట్రాక్టర్ కు కట్టబెట్టారనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోంది.

Read More : కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్.. భీమవరంలో పవన్ ఫైర్..

మిషన్​ భగీరథ మంచినీటి పథకానికి గత సర్కార్​ ఏకంగా 11 సంస్థల నుంచి అప్పులు తీసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం 24 వేల 061 కోట్ల రూపాయలు మేర అప్పులు తీసుకున్నారు. హౌజింగ్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ నుంచి 4 వేల 235 కోట్లు రూపాయలు తీసుకోగా.. నాబార్డు నుంచి 3 వేల 660 కోట్లు రూపాయలు.. కార్పొరేషన్​ బ్యాంకు నుంచి 1665 కోట్లు రూపాయలు తీసుకున్నారు. పలు బ్యాంకుల నుంచి కూడా వేల కోట్ల రూపాయలు గత సర్కార్ అప్పులు చేసింది. మరోవైపు మిషన్ భగీరథ ప్రాజెక్టులో వేసిన పైపు లైన్లు నాసిరకంగా ఉండటంతో లీకేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు.

Tags

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×