CM Revanth Reddy: పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత పాలకులదని.. గిరిజన రైతుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లమల నుంచి సీఎంగా మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగుతోందని ప్రసంగించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
‘పాలమూరు, నల్లమల అంటే నాకు ఎంతో గౌరవం. నల్లమల అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతంగా ఉండేది. పాలమూరు బిడ్డల చెమటతోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. ఈ ప్రాంత అభివృద్దికి కట్టుబడి ఉన్నాను. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత పాలకులది. గిరిజన రైతుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అచ్చంపేటలో ప్రతిరైతుకు సోలార్ విద్యుత్ అందించి తీరుతాం. సోలార్ విద్యుత్ అందించడమే కాదు ఆదాయం వచ్చేలా చేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: PM Kisan scheme: పీఎం కిసాన్ స్కీమ్.. రైతులకు షాక్ తప్పదా? లేకుంటే ఆ పని తప్పదు
తమ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ సహా అనేక పథకాలను అమలు చేసిందన్నారు. వరి వేసుకుంటే ఉరే అన్న దొర తన పొలంలో వరి వేసుకుని అమ్ముకున్నాడని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రికార్డు స్థాయిలో కోటీ 35 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిని సాధించాం. ప్రతి పేదవాడికి సన్నబియ్యాన్ని అందేలా చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పేద కుటంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు పథకం అమలు సక్సెస్‌ఫుల్‌గా అమలు అవుతోంది’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: AP Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు పథకం.. రేపో మాపో అధికారుల నివేదిక