CM Revanth Reddy: కులగణన సర్వే అనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మనకిచ్చిన ఆస్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు సర్వే తప్పని విమర్శిస్తున్నారని ఫైరయ్యారు. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం బీసీ నేతలతో సమావేశమై కులగణనపై స్పష్టత ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టిందని అన్నారు. బీజేపీ నిజంగా బీసీల పట్ల ప్రేమ చూపించాలనుకుంటే, కేంద్రం వద్ద ఉన్న కులాల లెక్కలను వెంటనే బయట పెట్టాలని సీఎం డిమాండ్ చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ ఈ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన పూర్తయితే, దేశం మొత్తం అమలు చేయాల్సి వస్తుందేమోననే భయంతో బీజేపీ కుట్రలు పన్నుతోందని అన్నారు.
ALSO READ: BREAKING: గ్రూప్-2 పరీక్షలు వాయిదా
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలకు క్లాస్ పీకారు. కుట్రలో భాగంగానే కొందరు కావాలని సర్వే తప్పని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సర్వే చేసిన నన్ను కొందరు బీసీ సంఘాల నేతలు దూషిస్తున్నారు. ఇప్పటి మీరు తెలుసుకోకపోతే మనకే నష్టం. అంతా సీఎం చూసుకుంటాడు అంటే.. నేనేం చేయలేను. కులగణనను ఇంతకన్నా పకడ్బందీగా ఎవరూ చేయరు. చేయలేరు. ఎక్కడ తప్పులు జరిగాయో బీజేపీ, బీఆర్ఎస్ నేతలే చెప్పాలి’ అని సీఎం తెలిపారు.
‘కులగణన సర్వే సాహసం దేశంలో ఎవరూ చేయలేదు. సర్వే చేపట్టిన నన్ను కొందరు విమర్శిస్తున్నారు. 36 వేల మంది డేటా ఆపరేటర్లను మేం నియమించా. ఎన్‌రోలర్‌గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ కూడా పూర్తి చేశారు. దాదాపు కోటి 12 లక్షలకు పైగా కుటుంబాలు కులగణనలో పాల్గొన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన ప్రయత్నమే చేయలేదు. కులగణనను న్యాయపరంగా, చట్టపరంగా చేశాం. 96.9 శాతం కులగణన జరిగింది. 3.1 శాతం మంది కులగణ సర్వేలో పాల్గొనలేదు. ఇంత పారదర్శకంగా, సమగ్రంగా కులగణన చేపడుతున్నా కొంతమంది నాయకులు ఇంకా సర్వే పాల్గొనలేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: Jobs in Indian Railways: శుభవార్త.. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం..
‘కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలుగానే జనాభా శాతాన్ని చెప్పారు. మేం చేపట్టిన కులగణన సర్వేలో మొత్తం 5 కేటగిరీలు ఉన్నాయి. ముస్లింలలో ఓబీసీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడిగా చెప్పలేదు. గుజరాత్ లో కూడా ఓబీసీ ముస్లింలు ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీసీల లెక్క తేలితే మాకేంటి.. అని ఆ వర్గం అడుగుతారని బీజేపీ, బీఆర్‌ఎస్ భయపడుతోంది. దేశంలోనే చారిత్రాత్మకమైన ఓ గొప్ప నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. భవిష్యత్‌లో కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవనుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: IOCL jobs: అలెర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 246 ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 25 రోజులు పాటు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేశారని సీఎం అన్నారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాత ప్రజలు మనకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారిక కార్యాచరణకు అధికార బృందాన్ని వేశామని తెలిపారు. బిహార్, కర్ణాటక వివిధ రాష్ట్రాల అధికారుల బృందాన్ని నిర్వహించాం’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.